బాలీవుడ్‌లో మళ్లీ మాఫియా గుప్పిట్లోకి ముంబై..?

0
6

ముంబై మహానగరం, ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి అండర్‌వరల్డ్ మాఫియా నీడలోకి వెళ్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 1970, 80ల నాటి భయంకరమైన గ్యాంగ్‌స్టర్ రోజులను గుర్తు చేస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా వరుసగా సినీ తారలను టార్గెట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. నిన్నటివరకు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ఈ గ్యాంగ్, ఇటీవల మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడు రోహిత్ శెట్టిని, తాజాగా యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను కూడా టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడటం ముంబైని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

ఈ దాడులకు తమదే బాధ్యతంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన పండిట్, హర్మాన్ సంధు సోషల్ మీడియా వేదికగా భయంకరమైన వీడియోలు, పోస్టులను షేర్ చేశారు. “సల్మాన్ ఖాన్ గనుక మా బిష్ణోయ్ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పకపోతే, అతని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాం” అని హెచ్చరించడంతో పాటు, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తే తదుపరి టార్గెట్ వాళ్లే అవుతారంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఓపెన్‌గా బెదిరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో 1998 నాటి కృష్ణజింకల వేట కేసు వివాదం కారణంగానే సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ ఈ స్థాయి కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వరుస పరిణామాలు చూస్తుంటే ముంబై ప్రజలకు హాజీ మస్తాన్, కరీం లాలా, మరియు దావూద్ ఇబ్రహీంలకు చెందిన డి-కంపెనీ నాటి పాత మాఫియా రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో ముంబై పోలీసులు ఎన్‌కౌంటర్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించి, మకోకా లాంటి కఠిన చట్టాలతో అండర్‌వరల్డ్‌ను పూర్తిగా అణచివేశారు. కానీ ఇప్పుడు జైలు నుంచే ఆపరేట్ చేస్తూ, విదేశీ ఉగ్రవాద గ్రూపుల నుండి ఆయుధాలు, నిధులు పొందుతున్న లారెన్స్ బిష్ణోయ్ లాంటి ఇంటర్-స్టేట్ గ్యాంగులు ముంబైని మళ్లీ శాసించాలని చూడటం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ కొత్త తరం మాఫియా ఉచ్చు నుండి బాలీవుడ్‌ను రక్షించేందుకు ముంబై పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఎలాంటి కఠిన వ్యూహాలు అమలు చేయబోతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.