Home తెలంగాణ గురిపెట్టి కొట్టిన రేవంత్.. టాటాను లాక్కొచ్చేసారు..!

గురిపెట్టి కొట్టిన రేవంత్.. టాటాను లాక్కొచ్చేసారు..!

0
2

తెలంగాణను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) జరిపిన సమావేశం అత్యంత విజయవంతమైంది. భారతదేశంలోనే అతిపెద్ద ‘AI డేటా సెంటర్’ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో టీసీఎస్ అనుబంధ సంస్థ ‘హైపర్‌వాల్ట్’ భారీ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దేశ ఐటీ రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ వేదికపై నయా ‘ఫ్యూచర్ సిటీ’గా అవతరించబోతోంది.

https://www.youtube.com/watch?v=k-farUUgp60&pp=0gcJCRsMAYcqIYzv

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, హైదరాబాద్ పరిధిలో దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక గిగావాట్ అంటే 1,000 మెగావాట్లు సామర్థ్యంతో ఈ ‘AI డేటా సెంటర్’ను నిర్మించనున్నారు. ఇందుకోసం టీసీఎస్ మరియు హైపర్‌వాల్ట్ సంస్థలు సంయుక్తంగా రికార్డు స్థాయిలో రూ. 70,000 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ మెగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే, ప్రాథమికంగా సుమారు 7,000 మంది ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే 2028 జూన్ 2 నాటికి ఈ ఏఐ డేటా సెంటర్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. అంతేకాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఫ్యూచర్ సిటీని కలిపే 50 కిలోమీటర్ల ప్రత్యేక రేడియల్ రోడ్డుకు (దీనిని ఎమర్జెన్సీ రన్‌వేగా కూడా వాడుకోవచ్చు) దివంగత పారిశ్రామిక దిగ్గజం ‘రతన్ టాటా’ పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.