Home తెలంగాణ బ్రేకింగ్: దానం నాగేందర్ కు షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

బ్రేకింగ్: దానం నాగేందర్ కు షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

0
9

తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనమైన తీర్పు తెలంగాణ హైకోర్టు వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు న్యాయస్థానంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై దాఖలైన పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ మైండ్ బ్లోయింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ గతంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన క్లీన్ చిట్ నిర్ణయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా పూర్తిగా కొట్టిపారేసింది.

బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం, తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా.. ఏకంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. పార్టీల లోపల మరియు వెలుపల ప్రజాప్రతినిధుల ప్రవర్తనను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నిశితంగా పరిశీలించాల్సిందేనని స్పష్టం చేస్తూ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు తెలంగాణ పాలిటిక్స్‌లో పెను భూకంపం సృష్టించింది.

ఒక దానం నాగేందర్‌పైనే కాకుండా, ఆయన తరహాలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల భవితవ్యం కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్‌తో త్వరలోనే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఇతర రాష్ట్రాల్లో సైతం పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సంచలనంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.