28 C
Vijayawada
Thursday, September 3, 2026
Homeక్రీడలుబీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో రోహిత్ రిటైర్మెంట్ బాంబ్..?

బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో రోహిత్ రిటైర్మెంట్ బాంబ్..?

భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై మరోసారి సంచలన చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ గురువారం ఏర్పాటు చేసిన కీలక సమీక్షా సమావేశంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల భవిష్యత్తుపై కీలక చర్చ జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ సమావేశానికి ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. సెలెక్షన్ కమిటీకి చెందిన ఒక సభ్యుడు రోహిత్ శర్మను కలిసి, ‘మేము భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాం’ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త తెలుసుకున్న రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడానికి అంగీకరించాడంటూ మొదట పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచాయి. కానీ, ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాదడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ క్లాసిక్ ఇన్నింగ్స్ తర్వాత ప్రస్తుతానికి రోహిత్ రిటైర్మెంట్ ప్రసక్తే లేదని, ఈ ఆలోచనను పక్కనబెట్టక తప్పలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలపై ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేదని, వారు వన్డే వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో కొనసాగుతారని తెలుస్తోంది. ఇదే విషయంపై సౌతాఫ్రికా మాజీ దిగ్గజం జొంటి రోడ్స్ స్పందిస్తూ.. వరల్డ్‌కప్ లాంటి హై ప్రెజర్ టోర్నమెంట్‌లో కేవలం ప్రతిభే కాకుండా మానసిక దృఢత్వం, అనుభవం చాలా అవసరమని, అందుకే 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ లాంటి సీనియర్ లీడర్ టీమిండియాకు ఒక గొప్ప అస్సెట్ అని పేర్కొన్నారు. మరి ఈ రోజు జరగబోయే బీసీసీఐ అధికారిక మీటింగ్‌లో రోహిత్ భవిష్యత్తుపై బోర్డు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతోందోనని క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments