Home ఆంధ్రప్రదేశ్ భోగాపురం టు బ్యాంకాక్.. లగేజ్ సర్దుకోండి బాసూ!

భోగాపురం టు బ్యాంకాక్.. లగేజ్ సర్దుకోండి బాసూ!

0
3

బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకునే బ్యాచిలర్స్‌కు మరియు టూరిస్టులకు ఒక క్రేజీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ వచ్చే అక్టోబర్ 27, 2026 నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు నేరుగా డైరెక్ట్ నాన్-స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. మొన్న ఆగస్టు 17న పాత వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ పూర్తిగా కొత్త భోగాపురం ఎయిర్‌పోర్టుకు షిఫ్ట్ అయిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సరికొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నడవబోయే మొట్టమొదటి కొత్త ఇంటర్నేషనల్ రూట్ ఇదే కావడం విశేషం.

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ క్రేజీ రూట్‌లో విమానాలను నడపడానికి సర్వం సిద్ధం చేసింది. వారంలో రెండు రోజులు.. అంటే ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఉదయం 11.30 గంటలకు భోగాపురంలో ఈ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. థాయ్‌లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సరిగ్గా సాయంత్రం 4.00 గంటలకల్లా మీరు హ్యాపీగా బ్యాంకాక్ చేరుకోవచ్చు. ఇక రిటర్న్ జర్నీ విషయానికొస్తే.. ప్రతి బుధవారం, శనివారాల్లో అక్కడ తెల్లవారుజామున 2.10 గంటలకు బయలుదేరి, మన టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున 3.55 గంటలకల్లా భోగాపురంలో ల్యాండ్ అయిపోతుంది.

ఇక మనోళ్లకు వచ్చే మెయిన్ డౌట్.. “అన్నా, టికెట్ ధరలు ఎంత ఉంటాయి?” అని కదా. సోషల్ మీడియా టాక్ మరియు ప్రాథమిక అంచనాల ప్రకారం, వన్-వే టికెట్ ధర సుమారు రూ. 19,000 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది అని నెటిజన్లు ఇన్ స్టా కామెంట్స్ లో తెగ చర్చించుకుంటున్నారు. కొంతమంది “ధర కాస్త ఎక్కువే బాసూ.. ‘స్కూట్’ ఏవియేషన్ లాంటివి కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ఇంతకంటే తక్కువకే ఆఫర్ చేస్తున్నాయి” అంటుంటే.. మరికొందరేమో “హైదరాబాద్ వరకు ప్రయాణించే తిప్పలు లేకుండా, నేరుగా మన ఇంటి పక్క నుంచే నాన్-స్టాప్ జర్నీ అంటే ఆ మాత్రం ఉంటుందిలే” అని సర్దిచెప్పుకుంటున్నారు. ఏదేమైనా, నిన్నటివరకు కేవలం హైదరాబాద్, బెంగళూరు వాసులకే సొంతమైన బ్యాంకాక్ డైరెక్ట్ కనెక్టివిటీ.. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర జలాల ముంత ముంగిటకే వచ్చేసింది. నూతనంగా నిర్మించిన ఈ 3.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్‌వే కలిగిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రాక ఒక పెద్ద మైలురాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.