ఉత్తరాంధ్ర వలసలకు చెక్ పెట్టేందుకు జగన్ మార్క్ డ్రామా బీసీ గర్జన..?

0
6

విజయనగరం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్, పట్టున్న చిన్న శ్రీను నిష్క్రమణతో విజయనగరంలో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వరుసగా వైసీపీకి రాజీనామా చేసి కూటమి వైపు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ భారీ వలసలను ఎలాగైనా అడ్డుకోవాలనే తాపత్రయంతో, కేడర్ చేజారకుండా డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. వైసీపీకి కంచుకోటలాంటి ఉత్తరాంధ్రలో రోజురోజుకూ పడిపోతున్న తమ గ్రాఫ్‌ను కాపాడుకునేందుకు, పార్టీ నుంచి అవుట్‌గోయింగ్‌ను ఆపేందుకు ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో ఒక కొత్త పొలిటికల్ గిమ్మిక్‌కు తెరతీసింది. ఈ నెల 16న విశాఖపట్నంలో ఈ భారీ సభను ఏర్పాటు చేసి, బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ బీసీల జపం అందుకున్న జగన్ అండ్ కో, ఈ వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు వేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల తమ పాలనలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని, ఇప్పుడు చిన్న శ్రీను వంటి కీలక నేతల నిష్క్రమణతో విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ విచ్ఛిన్నమవుతుంటే.. కేడర్‌కు భరోసా ఇవ్వలేక ఈ బీసీ గర్జన నాటకానికి పూనుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై బురద జల్లడంతో పాటు బీసీల పేరిట రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికే విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఖాళీ అవుతున్న వైసీపీకి ఈ సభ ఏమేరకు ఊపిరి పోస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.