35 C
Vijayawada
Tuesday, September 1, 2026
Homeఆంధ్రప్రదేశ్స్థానిక పోరు వేళ వైసీపీని దెబ్బకొట్టిన యరపతనేని..!

స్థానిక పోరు వేళ వైసీపీని దెబ్బకొట్టిన యరపతనేని..!

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. గురజాల నగర పంచాయతీలో అధికారికంగా ప్రతిపక్ష వైసీపీ పూర్తిగా బలహీనపడేలా ఆ పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ లోకి చేరిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో ఈ చేరికలు పల్నాడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.

గురజాల నగర పంచాయతీ ఇన్‌చార్జ్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు అధికారికంగా సైకిల్ ఎక్కేశారు. గురజాల టీడీపీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా మంగళవారం టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిన నేతలకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పసుపు కండువాలు కప్పి, పార్టీలోకి ఎంతో సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న ఈ ప్రజాప్రతినిధుల చేరికతో గురజాలలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నగర పంచాయతీ పాలకమండలిలో కీలకమైన మెజారిటీ స్థానాలు ఒక్కసారిగా టీడీపీ వైపునకు మొగ్గడంతో గురజాలలో వైసీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్, కౌన్సిలర్లు ఒకే విడతగా పార్టీ మారడం గురజాల నగర పంచాయతీపై టీడీపీ పట్టును మరింత బలోపేతం చేసింది. ఈ భారీ చేరికల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టంగా పడనుందని, టీడీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోందని స్థానిక వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments