వెలిగొండపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్..!

0
64

వెలిగొండ ప్రాజెక్టు జలాలతో ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాల రూపురేఖలు మారుతుండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ ఫీడర్ కెనాల్‌లోకి వచ్చిన నీటితో అక్కడ ఉన్న వానరాలు గుంపుగా వచ్చి తమ దాహార్తిని తీర్చుకుంటున్న ఒక అందమైన వీడియోను సీఎం చంద్రబాబు తన అధికారిక ‘X’ ఖాతాలో షేర్ చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని పంచుకుంటూ.. “జలంతోనే.. జీవం, జీవితం” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎన్నో ఏళ్లుగా నీటి చుక్కకు నోచుకోక కరువుతో అల్లాడిన వెలిగొండ ప్రాంతానికి సాగునీటితో పాటు, ఇప్పుడు ప్రాణులకు సైతం తాగునీటి అవసరాలు తీరడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. మనుషులకే కాకుండా మూగజీవాల దాహాన్ని కూడా వెలిగొండ జలాలు తీరుస్తున్నాయని, ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతంలోని సమస్త జీవకోటికి కొత్త ఊపిరి పోసిందని సీఎం పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు మరియు నెటిజన్లు కరువు సీమలో వెలిగొండ జలాల ప్రాధాన్యతను వివరిస్తూ ముఖ్యమంత్రి పోస్టుకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/ncbn/status/2094722290223333854/video/1

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.