31 C
Vijayawada
Wednesday, September 2, 2026
Homeఆంధ్రప్రదేశ్కేరళలో జనసేనాని క్రేజ్.. పవన్ బర్త్‌డే వేడుకలు అదరహో..!

కేరళలో జనసేనాని క్రేజ్.. పవన్ బర్త్‌డే వేడుకలు అదరహో..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ జనసేన జోష్‌ను నింపాయి. కేరళలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘NIT-కాలికట్’ వేదికగా 300 మందికి పైగా విద్యార్థులు, యువత ఒక్కటై జనసేనాని జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా, స్థానిక కేరళ యువత కూడా ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం పవన్ కల్యాణ్‌కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అసాధారణ క్రేజ్ మరియు ప్రజాదరణకు అద్దం పడుతోంది.

పవన్ కల్యాణ్  పట్ల యువతలో ఉన్న ఈ భారీ అభిమానానికి ఆయన చూపించే సామాజిక బాధ్యత, ప్రజాసేవ పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధతే ప్రధాన కారణమని విద్యార్థులు కొనియాడారు. రాజకీయాల్లో ఆయన అనుసరిస్తున్న సిద్ధాంతాలు, సమాజ మార్పు కోసం ఆయన పడుతున్న తపన తమను ఎంతగానో ఆకర్షించాయని కేరళ యువత ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. మారుమూల కేరళ ప్రాంతంలోనూ జనసేన జెండాలు పట్టుకుని యువత జైకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments