అమెరికా ఎన్నికల్లో తెలుగు వెలుగులు లెఫ్టినెంట్ గవర్నర్ గా కృష్ణా జిల్లా అమ్మాయి

0
5

అమెరికాలో జరిగిన మిడ్ పోల్స్ లో విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధించింది. సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోను మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. సెనెట్ మనదేశంలో రాజ్యసభ లాంటిది. సభ్యుడి పదవీకాలం ఆరేళ్లుంటుంది. ప్రతినిధుల సభ సభ్యుడిపదవీకాలం రెండేళ్లు. ఈ ఎన్నికలతో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీ చేసిన భారత సంతతి నేతలు ఎక్కువమంది విజయంసాధిస్తే, రిపబ్లికన్ల తరపున పోటీ చేసిన వివేక్ రామస్వామి, సరిత కోమటిరెడ్డి లాంటి వాళ్లు ఓడిపోయారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన సరితా కోమటిరెడ్డి రిపబ్లికన్ పార్టీ తరపున న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలానికి చెందిన సరిత తల్లిదండ్రులు 80 ల్లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాలిఫోర్నియా నుంచి డెమొక్రటిక్ పార్టీ తరపున అమీ బెరా, రోఖన్నా, వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రమణ్యం గెలిచారు. రోఖన్నా పరిధిలోనే సాఫ్ట్ వేర్ క్యాపిటల్ అయిన సిలికాన్ వ్యాలీ వుంది. గుజరాత్ కు చెందిన అమీబెరా 8వ సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

లాస్ ఏంజెలెస్ మేయర్ గా నిత్యా రామన్ ఘన విజయం సాధించారు.. ఈవిడ సొంత రాష్ట్రం కేరళ. లాస్ ఏంజెలెస్ నగరానికి మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా రికార్డులకెక్కారు. న్యూయార్క్ తరువాత అమెరికాలో అత్యంత ప్రాధాన్యమున్న నగరం లాస్ ఏంజెలెస్. ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన హాలీవుడ్ అక్కడే ఉంది. సినిమాలు, టెలివిజన్, స్ట్రీమింగ్, సంగీత పరిశ్రమలకు ఈ నగరం ప్రధాన కేంద్రం. చెన్నైకే చెందిన ప్రమీలా జయపాల్, గుజరాత్ కుచెందిన పియా దండియా వాషింగ్టన్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి గెలుపొందారు.

అమెరికా తూర్పు తీరంలో రాజధాని వాషింగ్టన్ డీసీ సరిహద్దుగా వున్న మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన అరుణా మిల్లర్ ఘనవిజయం సాధించారు. గవర్నర్ గా మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టుగానే అమెరికాలో రాష్ట్రాలకు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవులుంటాయి. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడిగా వుంటే, లెఫ్టినెంట్ గవర్నర్ డిప్యూటీగా వుంటారు. గవర్నర్ లేనప్పుడు విధులు నిర్వహించడంతో పాటు, కొన్ని ప్రత్యేక బాధ్యతలు కూడా వుంటాయి. అరుణా మిల్లర్ ది హైదరాబాద్ అని ప్రధాన మీడియాలన్నీ రిపోర్ట్ చేశాయి. అది వాస్తవం కాదు. ఆమెది కృష్ణా జిల్లా. పుట్టిందికూడా అక్కడే. ఆ గ్రామంలో వీళ్ల బంధుగణం చాలా వుంది. ఆరుణ ఆ గ్రామంలో కొన్ని సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించారని బంధవులు చెప్తుంటారు. అరుణ తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు, మెకానికల్ ఇంజనీర్.

స్వస్థలం పెదపారుపూడి మండలంలోని వెంట్రప్రగడ. ఆయన విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ నుంచి 1972లో అమెరికా వెళ్లి అక్కడే సెటిలయ్యారు. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లారు కాబట్టి ఆమె స్వస్థలం హైదరాబాద్ అన్నట్టుగా కథనాలు రాశారు కానీ వాస్తవంగా ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా. అరుణ 1990లో అమెరికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ని వివాహం చేసుకున్నారు. 2004 నుంచి డెమొక్రటిక్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అంచెలంచెలుగా పదవులు చేపడుతూ 2022లో తొలిసారి మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండోసారి గెలుపొందారు. అరుణా మిల్లర్ కు డెమొక్రటిక్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.