సుకుమార్ పై చరణ్ గ్లోబల్ ఇమేజ్ ప్రెజర్..!

0
2

టాలీవుడ్  ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డుల వేటకు పునాది పడింది. ‘రంగస్థలం’ సినిమాతో రామ్ చరణ్ కెరీర్‌కు మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందించిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు ‘RC17’తో మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. చరణ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన మనసుకు ఎంతో దగ్గరైన వ్యక్తని పలు సందర్భాల్లో చెప్పిన సుక్కు, ఈసారి కేవలం ఒక హిట్ సినిమా తీయడం మాత్రమే కాకుండా.. చరణ్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసే సరికొత్త మిషన్‌ను భుజానికెత్తుకున్నట్లు సినీ వర్గాల్లో ఒక గట్టి టాక్ నడుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక దర్శకుడు సుకుమార్‌పై ఇండస్ట్రీ పరంగా ఒక ఊహించని ప్రెజర్ కూడా ఉంది. రామ్ చరణ్‌ను వరల్డ్ వైడ్‌గా ఒక పవర్‌ఫుల్ గ్లోబల్ స్టార్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన ఇప్పుడు పని చేయాల్సి వస్తోంది. గతంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి, ఆ కథ నందమూరి మోక్షజ్ఞ వైపు మళ్లడం లాంటి ఇండస్ట్రీ చేంజెస్ తర్వాత మెగా అభిమానుల చూపు మొత్తం ఇప్పుడు సుకుమార్ మార్క్ సినిమా పైనే ఉంది. అల్లు అర్జున్ కంటే చరణ్ తనకు ప్రత్యేకమని భావించే సుకుమార్, ఆ నమ్మకాన్ని గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేదా నెగటివిటీ రాకుండా ఉండేలా, ముందే అలెర్ట్ అయిన సుకుమార్ తన వైపు నుండి చాలా పక్కాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్‌ను కనెక్ట్ చేసే విజువల్ వండర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రీ-ప్రొడక్షన్ పనులకు అంత సమయం పడుతోందని, చరణ్ క్రేజ్‌కు పర్ఫెక్ట్ న్యాయం చేసే ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్‌తోనే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని ఇండస్ట్రీ ఇన్సైడర్స్ గట్టిగా చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.