దేవి శ్రీ ప్రసాద్, హీరోగా ఎల్లమ్మ ఫస్ట్‌ లుక్.. రిలీజ్ డేట్ ఖరారు..!

0
2

పుష్ప సినిమాతో పాన్-ఇండియా రేంజ్‌లో తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కేవలం సంగీతానికే పరిమితం కాకుండా, హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తూ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఎల్లమ్మ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

బలగం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకోవడమే కాకుండా ఎమోషనల్ అద్భుతాన్ని ఆవిష్కరించిన వేణు యెల్దండి ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో డిఎస్‌పి పార్శి అనే ఒక వైవిధ్యమైన ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, డిఎస్‌పి సరికొత్త మేకోవర్‌తో ఉన్న ఈ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా భారీ స్థాయిలో పాన్-ఇండియా మూవీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2027 మార్చి 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.