Home ఆంధ్రప్రదేశ్ వెలిగొండ, పోలవరం నిమ్మల ఫోటో మిస్సింగ్ పై సీఎం సీరియస్..!

వెలిగొండ, పోలవరం నిమ్మల ఫోటో మిస్సింగ్ పై సీఎం సీరియస్..!

0
3

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి మైలురాయిగా నిలిచిన ‘వెలిగొండ ప్రాజెక్ట్’, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభోత్సవాల నేపథ్యంలో అమరావతిలో ఒక ఆసక్తికర వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలు, హోర్డింగులలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫోటో లేకపోవడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు.

సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయంపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. శాఖా పరమైన సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలకు సంబంధించిన అధికారిక ప్రకటనల్లో సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలను తప్పనిసరిగా ముద్రించాలని, వారిని నిర్లక్ష్యం చేయడం సరికాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఎంతో కష్టపడి ప్రాజెక్టులను పూర్తి చేసిన ఇరిగేషన్ మంత్రి ఫోటోనే ప్రకటనల్లో లేకుండా చేయడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రొటోకాల్ లోపాలు మరియు తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా సమాచార పౌరసంబంధాల శాఖతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు పక్కా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు గట్టిగా ఆదేశించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.