దక్షిణ భారతదేశంలో భారీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య వార్ పీక్స్‌కు చేరింది. సౌత్ కొరియా దిగ్గజ సంస్థ ‘హెచ్‌డీ హ్యుందాయ్’ ప్రతిపాదించిన ₹38,000 కోట్ల మెగా షిప్‌యార్డ్ ప్రాజెక్ట్‌ను.. తమిళనాడు నుంచి ఏపీలోని కాకినాడకు రప్పించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 15,000 మందికి డైరెక్ట్ గా, మరో 75,000 మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇంతటి గోల్డెన్ ఛాన్స్ చేజారిపోయే పరిస్థితి రావడంతో.. ఇప్పుడు తమిళనాడు యువత అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది.
సాగు భూములను ఇండస్ట్రియల్ పార్కుల కోసం సేకరించబోమంటూ తమిళనాడు మంత్రులు చేసిన ప్రకటనలు హ్యుందాయ్ లాంటి భారీ ప్రాజెక్టుల పాలిట శాపంగా మారాయి. ఇదే టైమ్‌లో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు, సింగిల్ విండో ద్వారా వేగవంతమైన అనుమతులు, కేంద్రంపై ఒత్తిడి తెస్తూ అందిస్తున్న మెరుగైన రాయితీలు పారిశ్రామిక దిగ్గజాలను ఫిదా చేస్తున్నాయి. తూత్తుకూడికి వెళ్లాల్సిన ప్రాజెక్ట్‌ను కాకినాడ వైపు మళ్లించేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పొరుగు రాష్ట్రాల పెట్టుబడులపై ఏపీ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో తమిళనాడు నెటిజన్లు సైతం లోకేష్ పనితీరును మెచ్చుకుంటూ, తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.







