అమరావతిలో పొలిటికల్ హీట్, చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్..!

0
34

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన సమావేశానికి తెరలేపారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ అత్యవసర సమావేశంలో ప్రధానంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల వ్యూహాలపైనే సుదీర్ఘంగా చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఇప్పటికే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన మంత్రుల బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొడుతూ, కోర్టు కేసులను వేగంగా పరిష్కరించుకుని అనుకున్న సమయానికే ఎన్నికలు జరిపి తీరుతామని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం జరగబోయే సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, కోర్టు వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, అలాగే క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల క్లీన్ స్వీప్ లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక అడుగులపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో కేవలం స్థానిక పోరు మాత్రమే కాకుండా.. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలు, విద్యా మరియు వైద్య రంగాలను టార్గెట్ చేస్తూ విపక్షాలు పన్నుతున్న వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా చంద్రబాబు సమీక్షించనున్నారు. అదేవిధంగా, ప్రజా సంక్షేమ పథకాల అమలు మరియు పాలనాపరంగా మరింత దూకుడు పెంచేందుకు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సాయంత్రం భేటీ ముగిసిన తర్వాత ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, అటు అధికార కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష వైసిపి క్యాంప్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.