తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమాను మించిన క్లైమాక్స్ సీన్‌ను తలపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ వేదికగా కొత్త ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ చేసిన ఒక చిన్న సైగ.. ఇప్పుడు డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్ కి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ దవడను ఉద్దేశించి విజయ్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడంటూ డీఎంకే శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిపై నిన్న స్టాలిన్ స్వయంగా ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ నిజాలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. అసలు అసెంబ్లీలో విజయ్ ఏం చేశాడు..? దానికి స్టాలిన్ ఇచ్చిన కౌంటర్ ఏంటి..? ఓ లుక్ వేద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో పోలీస్ శాఖ పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో సీన్ ఒక్కసారిగా హీటెక్కింది. ప్రతిపక్ష డీఎంకే అవినీతి గురించి మరియు ఎమర్జెన్సీ కాలం నాటి ‘మీసా’ చట్టం గురించి సీఎం విజయ్ మాట్లాడుతూ.. సడన్ గా తన కుడిచేతిని దవడ దగ్గర పెట్టి, దవడను పైకి లేపుతున్నట్లు ఒక విచిత్రమైన సైగ చేశాడు. ఈ సైగ చూసి డీఎంకే లీడర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. 1976 ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్నప్పుడు స్టాలిన్ పై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన దవడ ఎముక విరిగిపోయింది.
నాటి నుంచి ఆయన ముఖంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ కావాలనే అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ శారీరక లోపాన్ని వెక్కిరిస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడ్డాడంటూ డీఎంకే శ్రేణులు అసెంబ్లీ లోపల, బయట పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. వివాదం ముదరడంతో.. విజయ్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ.. “ఆ సైగ కావాలని చేసింది కాదు, అనుకోకుండా నా బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్పు మాత్రమే, ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరచడం నా ఉద్దేశం కాదు” అని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశాడు.
విజయ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఊరుకోలేదు. నిన్న ఒక 10 నిమిషాల సుదీర్ఘ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. స్టాలిన్ మాట్లాడుతూ.. “నువ్వు అసెంబ్లీలో చేసిన ఆ వెటకారపు సైగ.. నాడు ఎమర్జెన్సీలో జైల్లో నాపై జరిగిన పోలీస్ బ్రూటాలిటీకి పక్కా నిదర్శనం. నన్ను, నా అనుచరులను కుష్టు వ్యాధిగ్రస్తులుండే వార్డులో బంధించి, పోలీసులు నా దవడ ఎముకలు విరిగేలా దారుణంగా కొట్టారు. నన్ను ఎంతగా అవమానించాలని చూసినా.. నా ఒంటిపై ఉన్న ఈ గాయాలు ప్రజాస్వామ్యం కోసం నేను చేసిన పోరాటానికి గుర్తులు, ఆ చరిత్రను ఎవ్వరూ మార్చలేరు” అంటూ భావోద్వేగంగా సమాధానం ఇచ్చాడు.
అంతేకాకుండా విజయ్ పాలిటిక్స్ పై కూడా స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. “సీఎం విజయ్ అసెంబ్లీని ఒక సినిమా షూటింగ్ స్పాట్‌లా, రీల్స్ చేసుకునే వేదికలా మార్చేశాడు. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి రీల్స్ చేస్తూ కొత్త తరాన్ని మోసం చేస్తున్నాడు” అంటూ స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ దవడ వివాదం డీఎంకే, అధికార టీవీకే పార్టీల మధ్య పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కి తీసుకెళ్లింది.
https://x.com/mkstalin/status/2097888461751775531/video/1














