రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై చీఫ్ సెలెక్టర్‌కు యువరాజ్ వార్నింగ్..!

0
3

దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌నకు టీమిండియా సన్నద్ధతపై మాజీ ఆల్రౌండర్, వరల్డ్‌కప్ హీరో యువరాజ్ సింగ్ సెలెక్షన్ కమిటీకి ఒక పవర్‌ఫుల్ మెసేజ్ పంపారు. వెస్టిండీస్‌తో జరగబోయే వైట్-బాల్ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసినప్పటికీ, రాబోయే మెగా టోర్నీలో రోహిత్ స్థానంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, గతంలో భారత్ చేసిన తప్పులను గుర్తుచేస్తూ సెలెక్టర్లు ఇప్పటి నుంచే ఒక స్థిరమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని యువీ సూచించారు.

టీమిండియా గత కొన్ని ఐసీసీ టోర్నీలలో కీలక దశల్లో ఓడిపోవడానికి చివరి నిమిషంలో జట్టులో చేసిన భారీ మార్పులే కారణమని యువరాజ్ సింగ్ విశ్లేషించాడు. “మనం 2027 ప్రపంచకప్ గెలవగలరని నమ్మే ఒక కోర్ టీమ్‌ను ఇప్పుడే ఎంచుకోవాలి. వాళ్లు ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా సరే.. ఆ టోర్నీ వచ్చే వరకు వాళ్లకే అండగా నిలబడాలి. ప్రపంచకప్‌నకు కేవలం ఒక ఏడాది సమయం ఉందనగా పెద్ద మార్పులు చేస్తే జట్టు దెబ్బతింటుంది” అని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీకి యువీ స్పష్టం చేశాడు.

ప్రస్తుత క్రికెట్ కాలెండర్‌లో టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా, 50 ఓవర్ల వన్డేలు తక్కువగా ఉన్నాయని యువీ గుర్తుచేశాడు. కాబట్టి దొరికిన కొన్ని వన్డే మ్యాచ్‌ల్లోనే ఎంపిక చేసిన 16 లేదా 20 మంది ఆటగాళ్లకు తగినంత గేమ్ టైమ్ కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు వరుసగా ప్రపంచకప్‌లు గెలవడానికి కారణం వారి జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే మ్యాచ్ విన్నర్లు ఎక్కువ మంది ఉండటమేనని, టీమిండియా కూడా అదే తరహాలో ఏ పరిస్థితినైనా తట్టుకుని నిలబడే బలమైన కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని హితవు పలికాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.