డేట్స్ ప్లీజ్, మలయాళ హీరోయిన్ కు పిచ్చ క్రేజ్..!

0
2

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి సౌత్ ఇండియన్ సినిమాను ఒక్క ఊపు ఊపేస్తున్న సరికొత్త క్రష్ మమితా బైజు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత విజయవంతమైన హీరోయిన్‌గా దూసుకుపోతోంది. కేవలం అందం, నటనతోనే కాకుండా.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

మమితా బైజు నటించిన గత కొన్ని సినిమాలు వరల్డ్‌వైడ్‌గా సాధించిన వసూళ్లు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె నటించిన ‘ప్రేమలు’ చిత్రం ఏకంగా ₹130 కోట్ల భారీ వసూళ్లను సాధించగా.. ‘డ్యూడ్’ సినిమా ₹115 కోట్లను కొల్లగొట్టింది. ఇక దళపతి విజయ్ సరసన నటించిన ‘జననాయగన్’ ₹310 కోట్లు, సూర్యతో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ₹205 కోట్లు, అలాగే ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ ఏకంగా ₹310 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

ఈ భారీ వసూళ్లతో ఇండియన్ సినిమాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా ఆమె నిలిచింది. ఒకే నటి నటించిన వరుస సినిమాలు వందల కోట్ల క్లబ్‌లో చేరడం నిజంగా అరుదైన విషయమనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్స్, టాప్ ప్రొడక్షన్ హౌసెస్ అంతా ఇప్పుడు ఈ మలయాళ కుట్టి డేట్స్ కోసమే క్యూ కడుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా మమితా బైజు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.