భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్ హఠాన్మరణం చెందారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 4:20 గంటల ప్రాంతంలో ఆయన్ను మణిపాల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే ఆయన స్పృహ తప్పి పల్స్ పడిపోయింది. డాక్టర్ల బృందం దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. నానా పటేకర్ మరణానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు అందరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. హాస్పిటల్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో నానా పటేకర్‌కు తీవ్రమైన తలనొప్పి, ఛాతిలో అసౌకర్యం మొదలైంది. దాంతో ఆయన వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్‌కు “ఒంట్లో అస్సలు బాలేదు” అంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించారు. కానీ అది బాగా లేట్ నైట్ కావడం వల్ల ఆ స్నేహితుడు నిద్రపోయి మెసేజ్ చూడలేదు.
ఆ తర్వాత నానా పటేకర్ నేరుగా ఫోన్ కాల్ చేయడంతో నిద్రలేచిన ఆ ఫ్రెండ్ కంగారుగా తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నానా పటేకర్ విపరీతంగా చెమటలు పట్టి స్పృహ కోల్పోతుండడంతో వెంటనే హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌ను రప్పించారు. కానీ హాస్పిటల్ చేరేలోపే పరిస్థితి విషమించింది. నానా పటేకర్ మరణవార్త తెలియగానే దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1978లో ‘గమన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అపహరణ్’, ‘వెల్కమ్’, మరియు మరాఠీలో ‘నటసామ్రాట్’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. హిందీ సినిమా హిస్టరీలోనే బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ విలన్.. ఇలా మూడు విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. కాగా, మహారాష్ట్రలోని పుణే జిల్లా డోంజె గ్రామంలో ఉన్న ఆయన ఫార్మ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నానా పటేకర్ అంత్యక్రియలు ముగిశాయి.






