Home క్రీడలు ఇండియాతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు డబుల్ షాక్..!

ఇండియాతో సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు డబుల్ షాక్..!

0
7

భారత పర్యటనలో భాగంగా జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్, ఫాస్ట్ బౌలర్ జాక్ ఫౌల్కేస్ గాయాల బారిన పడడంతో వారు భారత్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

అక్టోబర్ 22 నుండి ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ సిరీస్ ప్రారంభం కానుండగా.. ఈ లోపే ఇలా జరగడం కివీస్ మేనేజ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతోంది.గత నెలలో జరిగిన యూరోపియన్ టీ20 లీగ్‌లో ఆడుతున్న సమయంలో మార్క్ చాప్‌మన్‌కు ఎడమ తొడ కండరాల గాయం అయింది. అయితే అతను వన్డే సిరీస్ నాటికి కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

మరోవైపు బౌలర్ జాక్ ఫౌల్కేస్ కాంటర్బరీ మెన్స్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నప్పుడు కుడి హిప్ ఫ్లెక్సర్‌కు తీవ్రమైన గాయమైంది. అతను మళ్లీ గ్రౌండ్‌లోకి రావడానికి ఎంత టైమ్ పడుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్ల స్థానంలో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్ మరియు ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్‌లను టీ20 స్క్వాడ్‌లోకి రీప్లేస్‌మెంట్స్‌గా తీసుకుంటున్నట్లు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.