Skip to content
ట్రెండింగ్
ఫాలో అవ్వండి
బ్రేకింగ్
శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!చెక్క వర్సెస్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు.. అసలు ఏది సేఫ్..?రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!చెక్క వర్సెస్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు.. అసలు ఏది సేఫ్..?రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!

వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం, కుటుంబ కలహాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేదికను మార్చుకోవాల్సి రావడంతో బయటి ప్రపంచానికి ఇదంతా ‘జగన్ వర్సెస్ షర్మిల’ పోరులాగే కనిపిస్తోంది. అయితే, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సోదరి షర్మిల విషయంలో వైఎస్ జగన్ వ్యక్తిగతంగా సానుకూల దృక్పథంతోనే ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి మరియు పార్టీలోని ఓ కీలక నేత మితిమీరిన జోక్యం వల్లే వివాదం ఈ స్థాయికి చేరిందనే చర్చ వినిపిస్తోంది. కుటుంబ ఆస్తుల పంపకం, వ్యక్తిగత వ్యవహారాల విషయంలో షర్మిలతో సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఆలోచనలోనే జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబంలోని ఇతర సభ్యుల పట్టుదల, అలాగే వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఖ్య నాయకుడి జోక్యం కుటుంబ వ్యవహారాల్లోకి కూడా చొరబడటంతో పరిస్థితులు చేయిదాటిపోయాయని సమాచారం.

Advertisement

ప్రతి విషయంలోనూ ఆ నేత సలహాలు, వ్యూహాల పేరుతో కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగేలా వ్యవహరించడం వల్లే, యలహంక ప్యాలెస్ వివాదం కోర్టు ఉత్తర్వుల వరకు వెళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో సదరు నేత పెత్తనంపై విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేతలు సైతం గతంలో బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తన సొంత కుటుంబ వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం పెరగడం, తద్వారా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో విభేదాలు రోడ్డున పడి తన రాజకీయ ప్రతిష్టకు భంగం వాటిల్లడంపై వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సొంత కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక, మరోవైపు పార్టీ నేతల అత్యుత్సాహాన్ని కట్టడి చేయలేక జగన్ ఇరకాటంలో పడ్డారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కుటుంబ కలహాలను సామరస్యంగా చక్కదిద్దుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం తప్పదని భావిస్తున్న జగన్, త్వరలోనే తన కుటుంబ వ్యవహారాల్లో ఆ కీలక నేత జోక్యానికి కళ్లెం వేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Rajaneethi
రచయితRajaneethi

RajaNeethi న్యూస్ డెస్క్

రాజనీతిని ఫాలో అవ్వండి
రాజనీతి యాప్ఏపీ, తెలంగాణ రాజకీయాలు, జాతీయ వార్తలు, విశ్లేషణలు – అన్నీ ఒకే యాప్‌లో. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
షేర్ చేయండి:

సంబంధిత వార్తలు

మరిన్ని ›

మీ అభిప్రాయం తెలియజేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

WhatsApp షేర్