అర్ష్‌దీప్ వర్సెస్ సిరాజ్.. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రస్టింగ్ కామెంట్..!

0
1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027) లక్ష్యంగా భారత జట్టు కూర్పు, ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంపై చర్చ జోరందుకుంది. తాజాగా ఈ అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మధ్య గట్టి పోటీ నెలకొందని, అయితే ప్రస్తుతానికి అర్ష్‌దీప్ కొంచెం ముందంజలో ఉన్నాడని పఠాన్ అభిప్రాయపడ్డారు.

క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. “అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే, వ్యక్తిగతంగా నేను జట్టులో ఒక ఎడమచేతి వాటం పేసర్ ఉండటానికే మొగ్గు చూపుతాను. బౌలింగ్‌లో ఆ ప్రత్యేకమైన యాంగిల్ జట్టుకు ఎప్పుడూ అవసరమే. పైగా అర్ష్‌దీప్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సమర్థుడు” అని పఠాన్ పేర్కొన్నారు. సిరాజ్ వద్ద కూడా అవే నైపుణ్యాలు ఉన్నాయని, అయితే రాబోయే మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో అవకాశం దక్కితే ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారిందని అన్నారు.

మహ్మద్ సిరాజ్ అనుభవజ్ఞుడైన బౌలర్ అని కొనియాడిన పఠాన్, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలెక్టర్లకు గట్టి సవాలు విసరాలని ఆకాంక్షించారు. “సిరాజ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించే ఒకే ఒక్క అంశం ఉంది. కొత్త బంతితో అతను అద్భుతంగా రాణిస్తాడు, కానీ పాత బంతితో కూడా అంతే ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడా అనేదే ప్రశ్న. ఇప్పుడున్న అనుభవంతో అవకాశం వస్తే అతను దానికి సమాధానం చెప్పగలడు” అని పఠాన్ విశ్లేషించారు. కాగా, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే శుక్రవారం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.