పునీత్ రాజ్‌కుమార్ చివరి నిమిషాలపై డాక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

0
8

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెంది ఐదేళ్లు దాటినా ఆయన మరణాన్ని అభిమానులు, సినీ లోకం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 46 ఏళ్ల చిన్న వయసులోనే 2021 అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పునీత్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రమణారావు ఆ రోజు పునీత్ క్లినిక్‌కు వచ్చినప్పటి జ్ఞాపకాలను, ఆయన చివరి గంటల్లో ఏం జరిగిందనే విషయాలను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ రమణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పునీత్ రాజ్‌కుమార్ మరణించిన రోజు జిమ్‌లో దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా కిక్‌బాక్సింగ్ చేశారు. పునీత్ ఆ తరహా వర్కవుట్ చేయడం ఆ రోజే మొదటిసారి అని, క్లినిక్‌కు వచ్చేసరికి ఆయన ఒళ్లంతా తీవ్రంగా చెమటలు పట్టేసి విపరీతమైన అలసటతో కనిపించారని డాక్టర్ చెప్పారు. పునీత్ పరిస్థితిని చూసి అనుమానం వచ్చి తాను వెంటనే ఈసీజీ తీశానని, ఆ ఈసీజీ రిపోర్టులో గుండెపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా కనిపించిందని ఆయన వెల్లడించారు.

ఈసీజీలో తేడా రావడంతో డాక్టర్ రమణారావు వెంటనే పునీత్‌కు అత్యవసర మందులు ఇచ్చి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కారులో వెళ్తున్నంతసేపు పునీత్ స్పృహలోనే ఉన్నారని, భార్య అశ్విని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని తాను సూచించానని డాక్టర్ తెలిపారు. అయితే విక్రమ్ ఆస్పత్రికి చేరుకోవడానికి కేవలం ఒక్క నిమిషం ముందే పునీత్ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని, హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లేసరికి ఆయన పల్స్ పడిపోయిందని డాక్టర్ రమణారావు కన్నీటి పర్యంతమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.