గంభీర్ ఇచ్చిన చాక్లెట్ తో కివీస్‌కు వైభవ్ చుక్కలు..!

0
3

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టు టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఊదేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీలు సృష్టించిన సునామీ ఇన్నింగ్స్‌పై మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండో టీ20 మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 4 పరుగులకే అవుటైన వైభవ్ సూర్యవంశీని, మూడో మ్యాచ్‌లో తిరిగి తనకు అలవాటైన ఓపెనింగ్ స్థానానికి ప్రమోట్ చేయడంపై రమేష్ స్పందించారు. టీమ్ మేనేజ్మెంట్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపి అతనికి ఒక చాక్లెట్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. దాంతో ఆ పసివాడు వీకెండ్ వచ్చేసింది కాబట్టి రాబోయే రెండు రోజులు స్కూల్ సెలవలు అనే ఫ్రీ మైండ్‌తో ఉండే చిన్నపిల్లాడిలా మైదానంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు.

ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను రమేష్ దెయ్యంతో పోల్చారు. అభిషేక్ పేరు వింటేనే బౌలర్లు భయపడేలా బ్యాటింగ్ చేశాడని, దీపావళికి ముందే మైదానంలో వెయ్యి వాలా, పదివేల వాలా బాంబులు పేల్చాడని ప్రశంసించారు. అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 113 పరుగులు చేసి కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. వీరిద్దరి ధాటికి పవర్‌ప్లేలోనే భారత్ రికార్డు స్కోరు సాధించింది. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం వీరి బ్యాటింగ్ ప్రదర్శనను అత్యంత అద్భుతమని, తాము బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు పిచ్ స్వింగ్ అవుతున్నా వీరు అంతలా ఎలా కొట్టారో అర్థం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.