రియల్ టైమ్ లీడర్ చంద్రబాబు.. సహాయక చర్యల్లో రికార్డు స్పీడ్..!

0
2

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నాబ్ తీవ్ర తుఫాన్ విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, వేగంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందించాలి, ఎంత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలనే దానికి చంద్రబాబు తన ముప్పై ఏళ్లకు పైగా పరిపాలనా అనుభవంతో మరోసారి నిరూపించారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా తుఫానులు తీరం దాటినప్పుడు రోజులకు రోజులు అంధకారం నెలకొంటుంది, కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది.

తుఫాన్ ముప్పు పొంచి ఉన్నప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రం నుండే క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 32,000 మంది క్షేత్రస్థాయి సిబ్బంది, కలెక్టర్లతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వరుసగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించి, ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. “గాలి వేగం తగ్గడమే ఆలస్యం.. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలి” అని సీఎం ఇచ్చిన పిలుపుతో యంత్రాంగం అంతా అప్రమత్తమైంది.

దీని ఫలితంగానే, గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగినప్పటికీ.. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి రాత్రికి రాత్రే పనులు పూర్తి చేశారు. దాదాపుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని చాలా చోట్ల అర్ధరాత్రి సమయానికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, రహదారులపై విరిగిపడిన వందలాది భారీ వృక్షాలను కేవలం రెండు గంటల వ్యవధిలోనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని సీఎం విధించిన గడువు క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసింది.

జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లపై ఎక్కడికక్కడ చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వీటితో పాటు పునరావాస కేంద్రాలలో ఉన్న సుమారు 28,000 మందికి పైగా బాధితులకు నాణ్యమైన భోజనం, తాగునీటితో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడికక్కడే మందులు అందేలా వైద్య ఆరోగ్య శాఖను చంద్రబాబు అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతా ప్రజల మధ్యే ఉండి పనిచేసేలా చంద్రబాబు చేసిన మానిటరింగ్ వల్ల ఊహించిన దానికంటే చాలా తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులు వచ్చాయి. నష్టం ఎంత ఉన్నా, ఒక పాలకుడిగా చంద్రబాబు చూపించిన స్పీడ్, అంకితభావం చూసి బాధితులు సైతం “హాట్సాఫ్ చంద్రబాబు” అంటూ సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలోనూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విపత్తు నిర్వహణలో చంద్రబాబు మార్క్ ఏంటో ఈ ‘అర్నాబ్’ తుఫాన్ రెస్క్యూ ఆపరేషన్ మరోసారి స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.