భువనేశ్వర్ ఆడించడం పెద్ద తప్పు: ఇర్ఫాన్ పఠాన్ ఘాటు విమర్శలు..!

0
3

న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవడంపై మాజీ ఆల్‌రౌండర్, వరల్డ్ కప్ విన్నర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీసీఐ సెలెక్టర్లు భువీని ఈ సిరీస్‌కు ఎంపిక చేసి చారిత్రాత్మక తప్పు చేశారంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన భువనేశ్వర్ కుమార్, ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు.

నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 180 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పఠాన్ స్పందిస్తూ.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చాలా దూరంలో ఉందని, ఈ సమయంలో 36 ఏళ్ల సీనియర్ బౌలర్‌ను ఆడించడంలో ఎలాంటి అర్థం లేదని ప్రశ్నించాడు. ఒకవేళ వన్డే వరల్డ్ కప్ కోసం భువీని సిద్ధం చేయాలనుకుంటే వన్డే సిరీస్‌లలో ఆడించాల్సింది కానీ, ఇక్కడ కాదన్నాడు.

భువీని ఆడించడం వల్ల యువ ఫాస్ట్ బౌలర్లకు దక్కాల్సిన సవర్ణావకాశాన్ని సెలెక్టర్లు చేజేతులా పాడుచేశారని ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. భువీ స్థానంలో మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్ లాంటి యువ స్పీడ్‌స్టర్లకు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చి ఉంటే, వారికి న్యూజిలాండ్ లాంటి కఠినమైన పిచ్‌లపై బౌలింగ్ చేసిన మంచి అనుభవం లభించేదని హితవు పలికాడు. భువీ నైపుణ్యాలపై తనకు ఎలాంటి సందేహం లేదని, కానీ సెలెక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని పఠాన్ స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.