ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కూటమి కైవసం..!

0
5

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన షేక్ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి ప్రత్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక లాంఛనమైంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆళ్లగడ్డలో ఎలాంటి పోటీ లేకుండా మొత్తం వార్డులు ఏకగ్రీవం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

ఈ మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డుల పంపకాల్లో అధికార తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. తాజా ఫలితాల ప్రకారం మొత్తం స్థానాల్లో టీడీపీ అత్యధికంగా 22 వార్డులను సొంతం చేసుకోగా.. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ 2 వార్డులను కైవసం చేసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని వార్డుల్లోనూ ఏకగ్రీవాలు నమోదు కావడంతో ఎలాంటి పోలింగ్ అవసరం లేకుండానే ఆళ్లగడ్డ మున్సిపల్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్నట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.