గత 12 ఏళ్ళ నుంచి బిజెపితో పరోక్షంగా స్నేహం చేస్తోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఇప్పుడు రూట్ మార్చారా..? అంటే అవుననే సమాధానం వినపడుతున్నారు. ఢిల్లీ వేదికగా ఎన్నికల వ్యవస్థలోని లోపాలపై నిరసన తెలుపుతూ అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివిస్టులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు మద్దతుగా జగన్ బుధవారం అర్ధరాత్రి వేళ ట్వీట్ చేయడం వెనుక ఒక సరికొత్త రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ట్వీట్ కేవలం ప్రజాస్వామ్యం గురించింది కాదని, జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న యువతను, ముఖ్యంగా డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న జెన్-జీవర్గాలను తన వైపు తిప్పుకునేందుకే జగన్ ఈ రూట్ ఎంచుకున్నారనే టాక్ నడుస్తోంది.
నిజానికి, సిస్టమ్‌లోని లోపాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న సి.జె.పికి సోషల్ మీడియాలో నేటి యువత నుంచి విశేష మద్దతు లభిస్తోంది. జాతీయ స్థాయిలో ఇటువంటి పోరాటాలకు బహిరంగంగా సంఘీభావం ప్రకటించడం ద్వారా.. తాను కూడా యువత ఆలోచనలకు, వ్యవస్థను ప్రశ్నించే విప్లవాత్మక భావాలకు కనెక్ట్ అవుతున్నాననే సంకేతాన్ని జగన్ పంపే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, జాతీయ స్థాయి అంశాలపై ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌గా ఉండే నేటి తరాన్ని ఆకట్టుకోవడానికి ఇదొక వ్యూహాత్మక ముందడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఈ పొలిటికల్ సెటప్‌లో కూటమికి గట్టి ప్రత్యామ్నాయంగా నిలబడాలన్నా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు దగ్గర కావాలన్నా.. భవిష్యత్తులో ఏదైనా పట్టు సాధించాలన్నా అది కేవలం తనకే సాధ్యమనే బలమైన నమ్మకంతో జగన్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయేను ఢీకొట్టే ఏకైక ఆప్షన్ తానేనని, అందుకే జాతీయ స్థాయి వేదికలను కూడా వాడుకుంటూ యువతలో తన ఇమేజ్ను కొత్తగా రీ-బ్రాండ్ చేసుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected. Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation. I empathise with @SauravDassss and @AshutoshRanka.</p>— YS Jagan Mohan Reddy (@ysjagan) <a href=”https://x.com/ysjagan/status/2110426607831916874?ref_src=twsrc%5Etfw”>October 14, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>














