వృద్ధ పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

0
5

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు భారీ ఊరటనిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న అదనపు పింఛను (Additional Quantum of Pension) ప్రయోజనాలను పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో, దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ నూతన ఆదేశాలను వెలువరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వృద్ధ పెన్షనర్లకు ఆర్థికంగా మరింత లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వం జారీ చేసిన తాజా స్లాబ్‌ల ప్రకారం, 70 నుండి 75 ఏళ్ల లోపు వయసున్న వృద్ధ పెన్షనర్లకు అదనపు పింఛను ప్రస్తుతమున్న 7 శాతం నుండి 10 శాతానికి పెంచారు. అలాగే 75 నుంచి 80 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇచ్చే అదనపు పింఛనును 12 శాతం నుండి 15 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 80 సంవత్సరాలు దాటిన వృద్ధుల అదనపు పింఛను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదని, వారికి గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ పెరిగిన అదనపు పింఛను ప్రయోజనాలు డిసెంబర్, 2026 నెలకు సంబంధించిన పెన్షన్ నుండి వర్తిస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. దీని ప్రకారం పెరిగిన మొత్తంతో కూడిన నూతన పింఛనును జనవరి 1, 2027న వృద్ధులకు చెల్లిస్తారు. ఈ ప్రయోజనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.