జ్ఞానేశ్ కుమార్ మరో ప్రధాన్ అవుతారా..?

0
10

రాజకీయ వ్యూహాల్లోనూ, ఉద్యమాలను నడిపించడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించే కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ రాజధాని వేదికగా మరో భారీ పోరాటానికి తెరలేపింది. గతంలో తాము పట్టుబడితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంతవరకు వదిలిపెట్టని సీజేపీ.. ఇప్పుడు ఏకంగా దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక వ్యక్తిని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడమే ఏకైక లక్ష్యంగా.. నేటి నుంచే దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చింది.

ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం ఒక పవర్‌ఫుల్ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా సాగుతోందని సీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఎస్‌ఐఆర్ విధానం వెనుక ఉన్న లొసుగులను ఎండగడుతూ, దీనిని పూర్తిగా రద్దు చేసేవరకు తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది.

ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతోనే నేరుగా రోడ్డెక్కి పోరాడాలని సీజేపీ నిర్ణయించుకుంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. కాక్రోచ్ జనతా పార్టీ ఒకసారి ఒక అంశాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ టార్గెట్ చేస్తే దానికి తార్కిక ముగింపు ఇచ్చే వరకు విశ్రమించదనే సంకేతాలను గతంలోనే ఇచ్చింది.. గతంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఎండగట్టి.. ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేసేలా చేయడంలో సీజేపీ విజయం సాధించింది.

ఇప్పుడు అదే వ్యూహాన్ని సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ప్రయోగిస్తోంది. దేశంలో అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఈసీ రాజీనామా చేసేవరకు తమ నిరసనలు, ధర్నాలు నిరంతరాయంగా కొనసాగుతాయని పార్టీ స్పష్టం చేయడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి, సీజేపీకి మధ్య మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద రాజకీయ యుద్ధం జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.