విమానాన్నే కాదు.. భారతదేశాన్ని కాపాడిన పైలట్ స్మిత్.!

0
7

ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో పైలట్ స్మిత్ మచ్చర్ కో పైలెట్ దాడిని ఎదుర్కొని, కాక్ పిట్ తలుపులు తెరవడం, ప్రయాణీకులు అప్రమత్తమై కో పైలెట్ ని నిర్బంధించడం, విమానంలోనే ఉన్న ఆఫ్ డ్యూటీ పైలెట్లు విమానాన్ని సురక్షితంగా దించడంతో కథ సుఖాంతమైంది. న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని విమానాలతో ఢీకొట్టించి, వందల మంది ప్రాణాలు తీసిన దాడిలాంటి దుర్ఘటన జరగకుండా స్మిత్ మచ్చర్ అడ్డుకున్నాడు. స్మిత్ మచ్చర్ కు గుజరాత్ ప్రభుత్వం విశిష్ట గుజరాత్ గరిమ అవార్డు ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.

కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తున్నట్టు మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీ ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన అశోక చక్ర అవార్డు ప్రకటించాలని పైలెట్ల సంఘం, ఏబీవీపీ కేంద్రాన్ని కోరాయి. ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వచ్చే ఏడాది జరిగే ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై, సంప్రదాయ టార్చ్ లైటింగ్ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మచ్చర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నెతన్యాహు దీన్ని ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవంలో ఇచ్చే అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

సాధారణంగా ఈ గౌరవం ఇజ్రాయెల్ పౌరులకే ఇస్తారు. ప్రపంచం అంతా స్మిత్ మచ్చర్ ని హీరోగా అభినందిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు భారతదేశాన్ని, పైలెట్ స్మిత్ ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. భారత్ ఇజ్రాయెల్ కు నమ్మదగ్గ మిత్రదేశమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్మిత్ సాహసోపేతంగా వ్యవహరించి, పెద్ద ముప్పు తప్పించాడన్నారు. నెతన్యాహు, ప్రధాని మోడీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. అబుదబిలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్ ని దుబాయ్ యువరాజు షేక్ హమ్ దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ పరామర్శించాడు. దాడి చేసిన కో పైలెట్ ఒమన్ కు చెందిన హమామ్ అల్ హమ్మామీ అని, ఇతను రాడికల్ ఇస్లామిక్ భావజాలం వున్నవాడని చెప్తున్నారు.

ఉగ్రవాద భావజాలం వల్ల ఒమన్ ఎయిర్ లైన్స్, మొరాకో ఎయిర్ లైన్స్ లో నిషేధానికి గురయ్యాడు. అలాంటి వ్యక్తిని ఫ్లై దుబాయ్ రిక్రూట్ చేసుకోవడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాక్ పిట్లో ఉండే గొడ్డలితో వెనక నుంచి దాడి చేశాడని స్మిత్ చెప్తున్నాడు. ఒకవేళ స్మిత్ ఈ దాడిని ఎదిరించడంలో విఫలమై వుండే, కాక్ పిట్ తలుపులు తెరవలేకపోయి వుంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో విమానాన్ని ఇజ్రాయెల్లో ఏదో ఒక ప్రధానమైన భవనాన్ని ఢీకొట్టి వుండేవాళ్లు. విమానంలో వున్న ప్రయాణీకులతో పాటు, కొన్ని వందలమంది చనిపోయి వుండేవారు. అదే జరిగి వుంటే ఇవ్వాళ హీరోగా అభినందనలు అందుకున్న స్మిత్ మచ్చర్ ని ప్రపంచమంతా విలన్ గా చూసేది.

ఎందుకంటే, ఈ విమానానికి పైలెట్ ఆయనే కాబట్టి, లోపలేం జరిగిందో ఎవరికీ తెలియదు కాబట్టి. స్మిత్ మచ్చర్ అల్ ఖైదా ఏజెంటనో, ఐసిస్ ఉగ్రవాది అనో ముద్ర వేసేవాళ్లు. ఈ ఘటన భారత్, ఇజ్రాయల్ సంబంధాలని ప్రభావితం చేసుండేది. అమెరికాతో సహా ప్రపంచమంతా భారత్ వైపు వేలెత్తి చూపేది. భారతదేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ పాకిస్థాన్ రెచ్చిపోయి వుండేది. భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగేది.

ఇంతకాలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ, ఉగ్రవాద బాధిత దేశంగా వున్న ఇమేజ్ పోయేది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ఇంటా, బయటా విమర్శల వర్షం కురిసేది. ఇంటా, బయటా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేవి. దేశానికి అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా స్మిత్ కాపాడారని చెప్పాలి. మత మౌఢ్యంతో నిండిపోయిన ఒక దుర్మార్గుడి ప్రయత్నాన్ని అడ్డుకుని, స్మిత్ చేసిన సాహసం వందల మంది ప్రాణాలు కాపాడటమే కాదు, దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడకుండా రక్షించాడు. స్మిత్ ని భారత ప్రభుత్వం తగిన రీతిలో సత్కరిస్తే సముచితంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.