వేలం హార్దిక్ ఎవరికి..? కెప్టెన్సీపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

0
4

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రేడింగ్ విండోలో ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడటం దాదాపు ఖాయమనే వార్తలు వస్తుండగా, ఆయనను దక్కించుకోవడానికి ఐదు ప్రధాన ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నట్లు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు.

ఈ ట్రేడింగ్ వ్యవహారంలో హార్దిక్ పాండ్యాకు కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత అనుకూలమైన జట్టు అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కేకేఆర్ జట్టులో హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నాడు. హార్దిక్‌ను తీసుకోవడానికి బదులుగా కేకేఆర్ జట్టు రింకూ సింగ్ లేదా హర్షిత్ రాణాలను ముంబై ఇండియన్స్‌కు ఆఫర్ చేసే అవకాశం ఉందని అశ్విన్ అంచనా వేశాడు. అంతేకాకుండా, గుజరాత్ టైటాన్స్ జట్టు తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ముంబైకి ఇచ్చి, బదులుగా హార్దిక్‌ను తిరిగి సొంతం చేసుకునేలా ఒక సంచలన ట్రేడ్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషించాడు.

అయితే, ఈసారి కొత్త జట్టులోకి వెళ్ళడానికి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అనేది ఒక ముఖ్యమైన నిబంధన ఏమీ కాదని అశ్విన్ స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ నుండి బయటకు వచ్చేయడమే హార్దిక్ ప్రధాన లక్ష్యమని, తనకు సరిపోయే ఒక మంచి వాతావరణం ఉన్న జట్టు కోసం ఆయన చూస్తున్నారని తెలిపాడు. హార్దిక్ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లేదని కూడా అశ్విన్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఈ వార్తలతో ఐపీఎల్ ట్రేడింగ్ విండో మరింత ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.