టెక్ ప్రపంచంలో బిగ్ బాంబ్..!

0
4

గ్లోబల్ టెక్ ప్రపంచంలో మున్నెన్నడూ లేని విధంగా ఒక అతిపెద్ద సంచలనం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా దూసుకుపోతున్న ఎన్విడియా సామ్రాజ్యం ఒకే ఒక్క ప్రకటనతో ఒక్కసారిగా షేక్ అయింది. ఆ కంపెనీ కో-ఫౌండర్, గ్లోబల్ టెక్ ఐకాన్ జెన్సెన్ హువాంగ్ చైనీస్ స్పై ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఒక మహిళతో నడిపిన వివాహేతర సంబంధం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిగత విషయం కాకుండా, అమెరికా జాతీయ భద్రతకే ముప్పుగా మారింది. ప్రతిష్టాత్మక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక పరిశోధనాత్మక కథనంతో ఈ గ్లోబల్ టెక్ మార్కెట్ వణికిపోయింది.

అమెరికా నిఘా వర్గాల నివేదికల ప్రకారం.. సింగపూర్‌కు చెందిన ‘మెగాస్పీడ్’ అనే డేటా సెంటర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్ అనే చైనీస్ మహిళతో జెన్సెన్ హువాంగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. అయితే, నిఘా సంస్థల విచారణలో ఈ ఆలిస్ హువాంగ్ సాధారణ బిజినెస్ ఉమెన్ కాదని, ఆమె చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అనే గూఢచారి సంస్థకు అసెట్‌గా పనిచేస్తోందని తేలడం సంచలనంగా మారింది. చైనాకు అమెరికా ఏఐ చిప్స్ తరలింపు వ్యవహారాలపై నిఘా పెట్టిన తరుణంలో వీరిద్దరి సీక్రెట్ ఎఫైర్ వ్యవహారం కాస్తా బయటపడింది.

ఈ నివేదికలు అంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేయడంతో, జెన్సెన్ హువాంగ్ తన తప్పును అంగీకరిస్తూ ఎన్విడియా కంపెనీ ఉద్యోగులందరికీ ఒక అంతర్గత ఈమెయిల్ పంపారు. “నేను నా భార్యను చీట్ చేశాను. సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన మాట వాస్తవమే. నేను చేసింది ముమ్మాటికీ తప్పే, ఈ విషయంలో నేను ఎంతో బాధపడుతున్నాను” అంటూ తన కుటుంబానికి, కంపెనీలోని కొలీగ్స్ అందరికీ ఆయన క్షమాపణలు తెలియజేశారు. ఒక ఐదు ట్రిలియన్ డాలర్ల కంపెనీ సీఈఓ ఇలా తన పర్సనల్ ఎఫైర్ ని అంగీకరించడం సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఈ తరుణంలో ఎన్విడియా బోర్డు ఒక స్వతంత్ర డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేసి, లీగల్ అడ్వైజర్ల సమక్షంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.