ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసిన తర్వాత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు కేటాయించేందుకు వీలుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన అధికారిక ఎన్నికల గుర్తులను కమిషన్ సిద్ధం చేసింది.
ఈసారి ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల కోసం 25 ఉమ్మడి గుర్తులను, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. ఒకవేళ ఏ గ్రామంలోనైనా అభ్యర్థుల సంఖ్య ఈ గుర్తుల కంటే ఎక్కువగా ఉంటే, వారికి అదనంగా కేటాయించడానికి మరికొన్ని కొత్త గుర్తులను కూడా సిద్ధం చేయనున్నారు. వీటితో పాటు బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులెవరూ నచ్చని ఓటర్ల కోసం ‘నోటా’ గుర్తు కూడా అదనంగా అందుబాటులో ఉండనుంది.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు (మొత్తం 25):
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు-సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
వార్డు సభ్యుల అభ్యర్థుల గుర్తులు (మొత్తం 20):
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు.














