సిఎం సొంత ఇలాఖాలో జెడ్పీ పీఠాల సస్పెన్స్..!

0
4

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మూడు జడ్పీ చైర్మన్ కుర్చీలను కైవసం చేసుకోవడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను కూటమి గెలుచుకోవడంతో ఆయా జిల్లాల జడ్పీ పీఠాలను అధిరోహించేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.

ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తం మూడు జిల్లాలలో తిరుపతి జడ్పీ చైర్మన్ పీఠం కోసం పార్టీలో అత్యంత ఉత్కంఠ భరితమైన పోరు నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక రేసులో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి వర్గం ఒకవైపు, సీనియర్ మహిళా నాయకురాలు డాక్టర్ హేమలత మరొకవైపు గట్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు నేతలకు పార్టీలో బలమైన పట్టుండటంతో ‘పనబాక వర్సెస్ డాక్టర్ హేమలత’ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది.

అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇక చిత్తూరు జడ్పీ చైర్మన్ కుర్చీ కోసం ఏకంగా నలుగురు బలమైన ఆశావహులు రేసులో నిలిచి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే అక్కడ జడ్పీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఈ జిల్లా పరిషత్ పీఠానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రముఖ నేత పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసిందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే బాకీ ఉందంటూ గట్టిగా టాక్ నడుస్తోంది. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 3 జడ్పీ చైర్మన్ కుర్చీల ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ లోకేష్ తీసుకోబోయే తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశం ఇప్పుడు కూటమి శ్రేణులలో అత్యంత ఉత్కంఠను రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.