31 C
Vijayawada
Wednesday, November 25, 2026
Home తెలంగాణ హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!

0
2

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుపై కీలక దిశానిర్దేశం చేశారు. డ్రైవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో, ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే ఈ పాడ్ ట్యాక్సీలకు నిర్దిష్ట వేళలంటూ ఉండవని, ప్రయాణికులు తమకు అవసరమైనప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకుని ప్రయాణించవచ్చని అధికారులు వివరించారు.

తొలిదశలో భాగంగా కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు ఒక రూటు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు మరో రూటును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధికారుల వివరణ విన్న సీఎం రేవంత్ రెడ్డి, నగరంలో ట్యాంక్‌బండ్ చుట్టూ 11 కిలోమీటర్ల నిడివితో పాటు ఎంపిక చేసిన ఈ ప్రధాన మార్గాల్లో పీఆర్‌టీఎస్ సేవలను త్వరగా పట్టాలెక్కించాలని సూచించారు. ఈ ఆటోమేటెడ్ పాడ్ కార్ల నిర్వహణ కోసం నెక్లెస్ రోడ్డు, రాయదుర్గ్ మరియు పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో ప్రత్యేక డిపోలను నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మెట్రో రైలు స్టేషన్లకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించే ఈ వినూత్న రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ఐటీ కారిడార్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తీరనున్నాయి. మరోవైపు, నగరంలో జరుగుతున్న మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు మరియు ఇతర కీలక అభివృద్ధి పనుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల వేగం ఆశించిన స్థాయిలో లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేసిన సీఎం, వచ్చే ఎన్నికలకు ఏడాదిలోపే ఈ అభివృద్ధి పనులన్నీ నూటికి నూరు శాతం పూర్తి కావాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, ఇకపై ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి గట్టిగా ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.