పోస్టర్లకు అభిషేకంపై చంద్రబాబు సీరియస్..!

0
10

వైసీపీ పార్టీ కేవలం విధ్వంసాన్ని నమ్ముకుందని, హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉందంటూ సిఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వేరే రాష్ట్రాల నుండి సైతం కరడుగట్టిన నేరస్థులను తీసుకొచ్చి ఇక్కడి ప్రజలను, కూటమి నేతలను బెదిరిస్తున్నారని సీఎం ఆరోపించారు. “ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ‘రప్పా రప్పా’ రాజకీయాలు జరుగుతాయా? ఎన్నికల పోస్టర్లకు ఎక్కడైనా రక్తాభిషేకం చేస్తారా?” అని ప్రశ్నిస్తూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అరాచకాలు, భయాందోళనల మధ్యే సాగిందని మండిపడ్డారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల వాతావరణంపై చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి పూర్తి రక్షణ ఉందనడానికి కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ తరఫున అత్యధిక సంఖ్యలో మున్సిపల్ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని గుర్తుచేశారు.

అదే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే అసలు ప్రతిపక్షాలు నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఉండేది కాదని చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తూ, మళ్లీ ఆ ‘గొడ్డలి పార్టీ’ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడి చేస్తూ ‘టీడీపీ వాళ్లే దాడులు చేశారు’ అని అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.