వైసీపీకి షాక్ ఇచ్చిన దేవినేని అవినాష్..!

0
6

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ చుట్టూ ఒక ఆసక్తికరమైన పొలిటికల్ టాక్ నడుస్తోంది. నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైసీపీ అధిష్ఠానం మొదట బలమైన అభ్యర్థి కోసం వెతికింది. అందులో భాగంగానే దేవినేని అవినాష్‌ను గానీ, లేదా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయన సతీమణి సుధీరను గానీ మేయర్ బరిలో దించాలని పార్టీ పక్కా ప్లాన్ చేసింది. నగరంలో దేవినేని కుటుంబానికి ఉన్న పట్టు, కేడర్ బలం ఈ ఎన్నికల్లో కలిసి వస్తాయని అధిష్ఠానం భావించింది.

అయితే, పార్టీ అధిష్ఠానం నుండి ఈ ప్రతిపాదన రాగానే దేవినేని అవినాష్ ఊహించని విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. మేయర్ అభ్యర్థిత్వంపై చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఆయన తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారనే వార్త నగర రాజకీయాల్లో చెక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఏమాత్రం సుముఖంగా లేకపోవడం వల్లే కావాలనే సైడ్ అయిపోయారని స్పష్టమవుతోంది. అవినాష్ అందుబాటులోకి రాకపోవడంతో, దిక్కుతోచని స్థితిలో పడ్డ వైసీపీ అధిష్ఠానం చివరకు ప్రస్తుత మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేరును మరోసారి తెరపైకి తెచ్చి ఎంపిక చేయాల్సి వచ్చిందని లోకల్ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.

దేవినేని అవినాష్ ఈ స్థాయిలో వెనకడుగు వేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఓటమి భయం ఉన్నట్లు క్షేత్రస్థాయి విశ్లేషణలు చెప్తున్నాయి. అవినాష్ ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. గతంలో కాంగ్రెస్ నుంచి విజయవాడ ఎంపీగా, గుడివాడ నుండి టీడీపీ తరఫున కొడాలి నానిపై, ఆ తర్వాత వైసీపీలో చేరి విజయవాడ తూర్పు నుండి గద్దె రామ్మోహన్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుత కూటమి హవా చూస్తుంటే మేయర్ ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి దాదాపు ఖరారైపోయిందని గ్రహించే అవినాష్ తెలివిగా ఈ రేసు నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. మరోసారి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదంలో పడుతుందనే ముందస్తు వ్యూహంతోనే ఆయన మేయర్ పోటీకి దూరంగా జరిగిపోయారని స్పష్టంగా అర్థమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.