బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ విధ్వంసం..!

0
5

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం భారతదేశంలో ఏకంగా ₹59.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, గ్రాస్ పరంగా ₹70.25 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కూడా రజనీ హవా స్పష్టంగా కనిపించింది. విదేశాల్లో తొలిరోజు ₹55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు ఏకంగా ₹125.25 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అయితే, ఈ స్థాయి భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రజనీకాంత్ తన సొంత రికార్డును మాత్రం అధిగమించలేకపోయారు. రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ (2025) మొదటి రోజు భారత్ లో ₹65 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. దానితో పోలిస్తే ‘జైలర్ 2’ ఓపెనింగ్ నెంబర్స్ కొంచెం తక్కువగానే నమోదయ్యాయి. ఈ చిత్రానికి తమిళ వెర్షన్ నుండి అత్యధికంగా ₹43.35 కోట్లు రాగా, తెలుగు వెర్షన్ నుండి ₹12.50 కోట్లు వచ్చాయి.

ఓటీటీ విండో వివాదం కారణంగా ఉత్తరాదిలో పీవీఆర్-ఐనాక్స్ థియేటర్లలో హిందీ వెర్షన్ ప్రదర్శించకపోవడం వల్ల హిందీ బెల్ట్‌లో కేవలం ₹3.50 కోట్లు మాత్రమే వచ్చాయి, ఇది సినిమా వసూళ్లపై కొంత ప్రభావం చూపింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై సోషల్ మీడియాలో మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందన వస్తోంది. రజనీకాంత్ వన్-మెన్ షో, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని టాక్ నడుస్తోంది. రమ్యకృష్ణ, ఎస్‌జే సూర్య, మోహన్‌లాల్, విద్యాబాలన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.