Home తెలంగాణ రేవంత్ వర్సెస్ వైఎస్ గ్యాంగ్.. బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు రేవంత్ చెక్.!

రేవంత్ వర్సెస్ వైఎస్ గ్యాంగ్.. బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు రేవంత్ చెక్.!

0
5

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే, ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్న సీఎం రేవంత్‌కు.. మరోవైపు సొంత పార్టీలోనే ఉన్న పాత ‘వైఎస్సార్ క్యాంప్’ లీడర్లు నిరంతరం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ గట్టిగా నడుస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడాన్ని జీర్ణించుకోలేక, ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు, కుదురుకోనివ్వకుండా చేసేందుకు కొందరు సీనియర్లు మొదటి నుంచే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు ఆయన వెనకాడటం లేదు. అసలు రేవంత్‌ను ఇబ్బంది పెడుతున్న ఈ బ్యాచ్ ఎవరు..? వారి వ్యూహాలను రేవంత్ ఎలా తిప్పికొడుతున్నారు..? ఓ లుక్ వేద్దాం.

ఈ ఓల్డ్ గార్డ్ బ్యాచ్‌లో ఒకప్పుడు ముందు వరుసలో నిలిచిన పేరు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. వైఎస్సార్ హయాంలో ఇరిగేషన్ పనులను పర్యవేక్షించిన పొన్నాల.. ప్రభుత్వంపై అంతర్గత విమర్శలు చేస్తూ రేవంత్‌ను రక్షణలో పడేయాలని చూశారు. కానీ, రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి వ్యూహాల ముందు నిలబడలేక ఈయన గతంలోనే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. మరోవైపు వైఎస్సార్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా తన మార్క్ ‘తెలంగాణ లేఖల’ ద్వారా రేవంత్ రెడ్డి నిర్ణయాలను, పాలనా పద్ధతులను ప్రశ్నిస్తూ నిరంతరం ఢిల్లీ అధిష్ఠానానికి లైన్లు కలుపుతూ ఇబ్బంది పెట్టాలని చూశారు.

అయితే రేవంత్ రెడ్డి ఈ అంతర్గత కోవర్టు రాజకీయాన్ని అస్సలు సహించలేదు. క్రమశిక్షణా రాహిత్యం, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించినందుకు చిన్నారెడ్డిని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి నుండి రద్దు చేయించి, పార్టీలో క్రమశిక్షణే ముఖ్యమని రేవంత్ నిరూపించారు. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేక నిరంతరం హద్దులు దాటి విమర్శలు చేసిన మరో సీనియర్ లీడర్ టి. జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుండి పార్టీ నిర్ణయాలపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కిన జీవన్ రెడ్డి, పాత కాంగ్రెస్ నేతలకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్‌లో స్పీడ్ పెంచుకుంటూ పోవడంతో, పార్టీ కంటే తన వ్యక్తిగత పంతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జీవన్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో పార్టీకి గుడ్‌బై చెప్పి బయటకు వచ్చేశారు.

ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పాత వైఎస్సార్ క్యాంప్‌కు చెందిన లీడర్ అయినప్పటికీ, రేవంత్ రెడ్డి ఎంతో హుందాగా ఆయనను కలుపుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందంటూ కొందరు ఢిల్లీకి ఫిర్యాదులు తీసుకెళ్లినప్పటికీ.. రేవంత్ రెడ్డి సమయస్ఫూర్తితో భట్టి విక్రమార్కతో సయోధ్యను కొనసాగిస్తూ, పాలనలో ఆయనకు సముచిత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఇక ఈ వివాదంలో రేవంత్ రెడ్డి తీసుకున్న అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం.. కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడం.

కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ లక్ష్మణ రేఖ దాటడంతో, రేవంత్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కఠిన నిర్ణయం తీసుకుని ఆమెను కేబినెట్ నుంచి పంపించేశారు. దీనిపై కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ‘బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్’ చేస్తున్నారంటూ విమర్శలు చేసినా.. జనాలు మాత్రం రేవంత్ తీసుకున్న డిసిప్లిన్ నిర్ణయాన్నే సమర్థిస్తున్నారు. అటు నియోజకవర్గ నిధుల విషయంలో హడావుడి చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ను ఒప్పుకోక తప్పని పరిస్థితి తెచ్చారు.

ఈ ఓల్డ్ గార్డ్ బ్యాచ్ అంతా కలిసి సోషల్ మీడియా ద్వారా.. రేవంతే పాత వైఎస్సార్ క్యాంప్ లీడర్లను టార్గెట్ చేస్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, రేవంత్ రెడ్డి మాత్రం గ్రౌండ్ లెవెల్ డెవలప్‌మెంట్‌తోనే వారికి సమాధానం ఇస్తున్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే కుదురుకోనివ్వకుండా చేస్తున్న ఈ ఓల్డ్ బ్యాచ్ వ్యూహాలను.. సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ దూకుడు మరియు కఠినమైన నిర్ణయాలతో అడ్డుకుంటున్నారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారికైనా పదవులు ఊడుతాయని సురేఖ, చిన్నారెడ్డిల బర్తరఫ్ ద్వారా నిరూపించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.