33 C
Vijayawada
Saturday, September 5, 2026
Homeఆంధ్రప్రదేశ్ఏపీ ఉద్యోగుల కష్టాలకు ఎండ్ కార్డ్.. ఒకేసారి పీఆర్సీ, డీఏలపై వరాల జల్లు..!

ఏపీ ఉద్యోగుల కష్టాలకు ఎండ్ కార్డ్.. ఒకేసారి పీఆర్సీ, డీఏలపై వరాల జల్లు..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం ఉద్యోగుల పాలిట ఒక పెద్ద పండగలా మారింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు నేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు. ఉద్యోగుల విజ్ఞప్తులను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి, వారి సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరిస్తూ వరాల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పరిష్కారాల పట్ల ఉద్యోగ ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ఉద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి తక్షణ అంగీకారం తెలిపారు. దీంతో పాటు 1-7-2024 మరియు 1-1-2025 కాలానికి సంబంధించిన రెండు డీఏలను వచ్చే 2026 అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులకు చెల్లించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా, 2022 నాటి సరెండర్ లీవ్స్ బకాయిలన్నింటినీ వచ్చే సంక్రాంతి పండుగ లోపు ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో వేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీసు సిబ్బందికి ఈ దసరా పండుగ కానుకగా ఒక అదనపు సరెండర్ లీవ్ నగదును చెల్లించనున్నారు.

ఈ వరాల జల్లులో పెన్షనర్లకు, ఆరోగ్య సంరక్షణకు కూడా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వయసు పైబడిన పెన్షనర్లను ఆదుకునేలా అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను జనవరి 2027 నుంచి వర్తింపజేయనున్నారు. దీని ప్రకారం 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లభించనుంది. అలాగే ఎంతో కాలంగా అస్తవ్యస్తంగా ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేస్తూ, వచ్చే నెల నుంచే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు ఏ నెలకు ఆ నెల నిధులు క్రమంతప్పకుండా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాలన్నింటి వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా రూ.2,880 కోట్ల అదనపు భారం పడనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

- Advertisment -

Most Popular

Recent Comments