ఉత్తరాది ఢమాల్.. దక్షిణాది భలే భలే.. మోదీ క్యాబినెట్ లో సౌత్‌కి ఎందుకింత క్రేజ్..?

0
4
New Delhi, May 07 (ANI): Prime Minister Narendra Modi chairs a Union cabinet meeting, in New Delhi on Wednesday. (ANI Photo)

ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ లో ఇప్పుడు ఒకటే పెద్ద సౌండ్ వినిపిస్తోంది. అదేంటో తెలుసు కదా.. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. “పనితీరు బాలేదా.. అయితే ఇంటికే” అంటూ సగం మంది మంత్రులకు ఉద్వాసన పలికేందుకు మోదీ-షా ద్వయం పక్కాగా స్కెచ్ గీసింది. అయితే, ఈ ప్రక్షాళన వెనుక కేవలం మంత్రుల మార్పు మాత్రమే లేదు. అంతకంటే పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. ఈసారి మోదీ క్యాబినెట్‌లో నార్త్ ఇండియా కంటే.. సౌత్ ఇండియా హవా గట్టిగా కనిపించబోతోంది. అసలు ఉత్తరాదిని వదిలేసి, దక్షిణాది వైపు బీజేపీ ఎందుకు ఇంతగా ఆకర్షితురాలవుతోంది..? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు పోస్ట్‌మార్టం చేద్దాం.

అసలు మ్యాటర్ ఏంటంటే.. గత ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి కోటల్లో గట్టి షాక్‌లు తగిలాయి. నిన్నటివరకు “మాకు తిరుగులేదు” అనుకున్న హిందీ బెల్ట్ లో సీట్లు భారీగా తగ్గిపోయాయి. ఉత్తరాదిన పట్టు సడలడంతో.. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే సౌత్ ఇండియాను నమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలు అమృతంలా కనిపిస్తున్నాయి. నిన్నటివరకు “మేము హిందీలోనే మాట్లాడతాం, నార్త్ బెల్ట్ లోనే రూల్ చేస్తాం” అన్నట్టుగా ఉన్న లీడర్లు.. ఇప్పుడు సౌత్ ఇండియా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఉత్తరాది డ్యామేజ్‌ను సౌత్ మైలేజ్‌తో కవర్ చేయాలనేదే మోదీ గారి అసలైన ప్లాన్.

ఈ సౌత్ స్ట్రాటజీలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి కింగ్ మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో మరో పెద్ద పీఠం దక్కబోతోందనేది తాజా ముచ్చట. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏపీలో కూటమి బలంగా ఉండటం, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతుండటంతో.. టీడీపీకి మరో కీలకమైన కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయడం ద్వారా చంద్రబాబును మరింత ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంటే త్వరలోనే ఏపీ నుంచి మరో పసుపు కండువా నేత ఢిల్లీలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, ఇక్కడే మనకు మైండ్ బ్లాక్ అయ్యే అసలైన ట్విస్ట్ ఉంది. నిన్నటివరకు ఇండియా కూటమిలో ఉంటూ, బీజేపీని ముక్కలు ముక్కలు చేస్తాం అన్నట్టుగా మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ డీఎంకే పార్టీకి కూడా మోదీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారట. వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. డీఎంకేని ఎన్డీయే లోకి లాగడం ద్వారా అక్కడ సరికొత్త సమీకరణాలకు తెరలేపాలని చూస్తోంది. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి.. నిన్నటివరకు తిట్టుకున్న డీఎంకేకి ఇవాళ మంత్రి పదవి ఆఫర్ చేయడమే అతిపెద్ద ఉదాహరణ.

ఏదేమైనా.. ఢిల్లీ పీఠాన్ని కాపాడుకోవడానికి, 2029లో మళ్లీ అధికారం దక్కించుకోవడానికి బీజేపీ వేస్తున్న ఈ పావులు నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు కోల్పోయామనే భయమే.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల వైపు ఈ స్థాయి ప్రాధాన్యత పెంచడానికి కారణం. అటు టీడీపీకి మరో మంత్రి పదవి, ఇటు డీఎంకేకి ఆఫర్లు ఇవ్వడం చూస్తుంటే.. సౌత్ ఇండియా ఓట్ బ్యాంక్ ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతోంది. మరి మోదీ వేస్తున్న ఈ సరికొత్త సౌత్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? డీఎంకే నిజంగానే సైకిల్ గ్యాప్‌లో ఎన్డీయే గూటికి చేరుతుందా..? అనేది కాలమే నిర్ణయించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.