కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. మారుమోగుతున్న అమరావతి!

0
5

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ని జగన్ మోహనరెడ్డి అంగీకరించకపోయినా, ఆసేతు హిమాచలం అమరావతిని రాజధానిగా గుర్తించింది. దక్షిణాన రామసేతు నుంచి ఉత్తరాన హిమాలయాల వరకు అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రజలు గొంతెత్తి చెప్తున్నారు. అమరావతి మీద జగన్మోహనరెడ్డి, ఆయన పార్టీ నాయకులు, మేధావుల పేరుతో హైదరాబాద్లో తిష్టవేసిన దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, రాజధానిగా అమరావతి స్థానం పదిలంగా వుంది.

అమరావతికి కొన్ని వేల కిలోమీటర్ల దూరాన, దేశ సరిహద్దుల్లోని లడ్డాఖ్ లో ఒక చిన్నారి ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతా అని అడిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ కాశ్మీర్? నిన్నమొన్నటి వరకు రాజధానిపై స్పష్టత లేదు. చంద్రబాబు పుణ్యమా అని మళ్లీ అమరావతి ట్రాక్ మీదకొచ్చింది. రాష్ట్రంలో సొంతతల్లుల్ని చెల్లెళ్లని తన్ని తరిమేసే బ్యాచ్, రాష్ట్రం మీద, రాష్ట్ర రాజధాని మీద ఏ మాత్రం భక్తి లేని బ్యాచ్.. ఈ బ్యాచ్ గుర్తించకపోయినా అమరావతిని దేశం గుర్తించింది. దేశ ప్రజలు గుర్తించారు. ప్రముఖ యూట్యూబర్ సుధీర్ కుమార్ లడ్డాఖ్ లో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది ముస్లిం పిల్లలు అతన్ని ఆపారు. ఆపి తాగడానికి షర్బత్ ఇచ్చారు.

అతను రేటెంత అని అడిగితే ఈ రోజు మొహర్రం పండగ. అందుకే ఉచితంగా ఇస్తున్నాం. డబ్బులొద్దని పిల్లలు బదులిచ్చారు. వాళ్ల అభిమానానికి ఇతను ముగ్ధుడయ్యారు. ఈ లోపు ఒక బురఖా ధరించిన మహిళ సుధీర్ దగ్గరకు వచ్చి మీదే వూరుని అడిగితే, నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అనగానే పక్కనున్న పిల్లలు అమరావతా అన్నారు. ఏపీ అనగానే పిల్లలు అమరావతి అనడంతో సుధీర్ కుమార్ ఆశ్చర్యపోయారు. సుధీర్ కుమారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా ఆశ్చర్యపోతారు. నిజమైన ఆంధ్రులు గర్వపడతారు కూడా. జమ్ముకశ్మీర్ లో వున్న చిన్న పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గుర్తించి, చెప్పడం గర్వకారణమే కదా.

సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అయింది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాలో లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూడగానే నాక్కూడా చాలా ఆనందం వేసింది. ఇక్కడ కొన్ని కుక్కలు అమరావతిని గుర్తించకపోయినా, అమరావతిని నాశనం చేస్తామని ప్రతిజ్నలు చేస్తున్నా దేశంలో ప్రజలు అమరావతిని గుర్తించారు. నేను ఈ వీడియోని నాలుగైదుసార్లు చూశాను. చెన్నైలో వుండే ఒక పెద్దావిడైతే వీడియో చూడగానే చాలా సంతోషపడ్డాను. 20 సార్లు వీడియోని మళ్లీ మళ్లీ చూశానని ఎఫ్బీలో పోస్టు పెట్టారు. రాష్ట్రం మీద, రాజధాని మీద అభిమానం వున్నవాళ్లు, రాష్ట్రశ్రేయస్సుని కోరుకునేవాళ్లకుండే అనుభూతి అది.

మద్రాసులో వున్నా, బొంబాయిలో వున్నా, బోస్టన్లో వున్నా రాష్ట్రాభివ్రుద్ధి కోరుకునే వాళ్లకు ఆ ఫీల్ వస్తుంది. అమరావతిని దెబ్బతీయాలని, దాని గుర్తింపును చెరిపేయాలని గతంలో వైసీపీ నేతలు ఎంతగా కుట్రలు పన్నినా, రాజధానిగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దేశమంతటా ఎలా విస్తరించిందో చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. హిమాలయాల ఒడిలోని మారుమూల సరిహద్దు గ్రామాల పిల్లల మనస్సుల్లో సైతం AP అంటే అమరావతే అనే ముద్ర పడిపోయింది. అమరావతి నిర్మాణ విశేషాలకు సంబంధించిన వీడియోలని దేశంలో ప్రధాన విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేస్తే ఇంకా పాపులారిటీ వస్తుంది. అధునాతన నగరంగా పెట్టుబడులని ఆకర్షించే అవకాశం కూడా వుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.