కన్నకూతురు పెళ్లితో తెరవెనుక రాజకీయాలా..?

0
7

తన కుమార్తె పెళ్లి పత్రికను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయ ప్రచారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు కొందరు కావాలనే కట్టుకథలు అల్లుతున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల పోస్ట్ చేసారు. రాజకీయ విశ్లేషణల పేరిట జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని, శుద్ధ అబద్ధమని ఆమె కొట్టిపారేశారు.

వైసీపీ అధ్యక్షులు జగన్‌ను తాను చివరిసారిగా కలిసింది తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రిక ఇచ్చేందుకేనని, మళ్లీ ఇప్పుడు కలిసింది కేవలం తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు. ఒక తల్లిగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించడం సహజమని, ఇందులో ఎలాంటి వింత లేదని పేర్కొన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఒక పవిత్రమైన శుభకార్యానికి, రాజకీయాలకు లింకులు పెడుతూ.. ప్రజల్లో తనపై ఉన్న విశ్వసనీయతను, నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని షర్మిల గట్టిగా హెచ్చరించారు. తన బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, కొత్తగా ఒక్కటి కాబోతున్న నవదంపతులకు తమ హృదయపూర్వక ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.