అమరావతిలో మంత్రి నారా లోకేష్ హైలెవల్ మీటింగ్..!

0
8

రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ముఖ్య మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించడంలో స్థానిక అధికారులతో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. బాధితులకు పునరావాసం మరియు నిత్యావసరాల పంపిణీ వేగంగా జరిగేలా చూడాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడా అలసత్వానికి తావుండకూడదని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే అక్టోబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో నారా లోకేష్ వ్యూహాత్మక మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి ఒక్క స్థానంలోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రక్షించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశాన్ని ఉమ్మడి సమన్వయ కమిటీతో పాటు అధిష్ఠానం చూసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలనే కుట్రతో ప్రతిపక్షమైన ‘గొడ్డలి పార్టీ’ పన్నుతున్న కుయుక్తులు కూటమి ఐక్యత ముందు సాగవని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.