ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను కోలుకోలేని తీరని శోకంలో ముంచేసింది. అయితే, ఆయన మరణానికి సరిగ్గా నాలుగు రోజుల క్రితం గోవాలో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో చావు గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. “రేపు నేను ఉంటానో లేదో నాకు తెలియదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవడంతో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
గత ఆదివారం గోవాలోని దోనా పౌలాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ వేడుకకు నానా పటేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెల్లటి కుర్తా, మెడలో గమ్చా ధరించి ఎంతో యాక్టివ్‌గా కనిపించిన ఆయన.. వేదికపై మరాఠీలో ప్రసంగిస్తూ జీవితం, మరణంపై అత్యంత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “మనమందరం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్లవలసిందే. రేపు నేను ఇక్కడ ఉంటానో లేదో నాకే తెలియదు. ప్రతి ఒక్కరి జీవితం చివరికి ఆ బిందువుకు చేరుకోవాల్సిందే. కానీ ఆ చావు రాకముందే.. నేను అనుకున్నది, చేయాలనుకున్నది నిజంగా చేయగలుగుతున్నానా లేదా అని నాకు నేను ప్రశ్నించుకోవాలి” అంటూ మరణం,, మానవ జీవితంపై ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఆ ఈవెంట్ ముగిసిన సరిగ్గా నాలుగో రోజే, అంటే గురువారం తెల్లవారుజామున 5:20 గంటలకు నానా పటేకర్ తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఆసుపత్రిలో వైద్యులు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది. తాను చనిపోతానని ముందే ఊహించినట్లుగా ఆయన మాట్లాడిన ఆఖరి స్పీచ్ వీడియో క్లిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఒక గొప్ప నటుడు, అంతకంటే గొప్ప ఫిలాసఫర్‌ను దేశం కోల్పోయిందని నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.














