అక్టోబర్ 1 నుంచి అమెరికా వీసా కొత్త రూల్.. ఆ 3 కేటగిరీలపై నిఘా..!

0
2

 

అమెరికా వెళ్లాలనుకునే వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వీసా స్క్రీనింగ్, సెక్యూరిటీ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ సోషల్ మీడియా నిఘా పరిధిని పొడిగించింది. రాబోయే అక్టోబర్ 1, 2026 నుంచి మరో మూడు కీలక వీసా కేటగిరీలను కూడా ఈ సోషల్ మీడియా చెకింగ్ పరిధిలోకి తీసుకువస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రవర్తనను క్షుణ్ణంగా పరిశీలించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

ఈ తాజా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి కొత్తగా ‘I’ అంటే విదేశీ జర్నలిస్టులు,మీడియా ప్రతినిధులు, ‘TN’ అంటే కెనడా, మెక్సికో నిపుణులు, మరియు ‘TD’ అంటే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు వీసా కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటినీ తప్పనిసరిగా “పబ్లిక్” లేదా “ఓపెన్” మోడ్‌లో ఉంచాలి. భారతీయుల విషయానికి వస్తే, మీడియా రంగంలో ఉండి తాత్కాలికంగా అమెరికా వెళ్లాలనుకునే జర్నలిస్టులకు వర్తించే ‘I’ వీసా కేటగిరీ దరఖాస్తుదారులపై ఈ కొత్త రూల్ నేరుగా ప్రభావం చూపనుంది. దరఖాస్తుదారుల ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఖాతాలలో ఏవైనా అనుమానాస్పద పోస్టులు ఉంటే వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

అయితే, అమెరికా వీసాల కోసం ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ విధానం కొత్తదేమీ కాదు. ఇప్పటికే హెచ్-1బీ ఐటీ ఉద్యోగులు, ఎఫ్-1, ఎమ్-1 విద్యార్థులు, అలాగే జె-1 ఎక్స్ఛేంజ్ విజిటర్స్ వీసాల దరఖాస్తుదారులకు ఈ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు ఈ జాబితాకు మీడియా మరియు ఇతర మూడు కేటగిరీలను అదనంగా చేర్చారు. అక్టోబర్ 1 నుంచి వీసా ఇంటర్వ్యూలకు వెళ్లేవారు తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకుని సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.