భువీని తొక్కేసింది అగర్కరేనా..?

0
9

భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ నింపేలా టీమిండియా సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులోకి ఊహించని రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సెలక్టర్లు భువీని ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పవర్‌ప్లేలో స్వింగ్, సీమ్ మూవ్‌మెంట్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించి, గత సీజన్‌లో 17 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ భువీని ఇన్నాళ్లూ జట్టుకు దూరం పెట్టడం వెనుక ఉన్న ఇన్‌సైడ్ సెలక్షన్ స్టోరీ ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. భువనేశ్వర్ కుమార్ ఇన్నాళ్లూ టీమిండియాకు దూరం కావడానికి మాజీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్ అనుసరించిన విధానమే ప్రధాన కారణమని తెలుస్తోంది. అగర్కర్ తన పదవీ కాలంలో ‘భవిష్యత్తు వైపు చూడాలి’ అనే ఫిలాసఫీని బలంగా నమ్మేవాడు. డొమెస్టిక్ క్రికెట్ లేదా ఐపీఎల్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎంత బాగా రాణిస్తున్నప్పటికీ, తిరిగి పాత తరాన్ని జట్టులోకి తీసుకోవడానికి అగర్కర్ ఏమాత్రం ఇష్టపడలేదు. కేవలం యువ రక్తాన్ని మాత్రమే ప్రోత్సహించాలనే మొండి పట్టుదలతో ఉండటంతో భువీకి అర్హత ఉన్నా అవకాశాలు దక్కలేదు.

అయితే, సెలక్షన్ కమిటీలోని ఇతర జోనల్ సభ్యులకు, ముఖ్యంగా సెంట్రల్ జోన్ సెలక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్ కు అగర్కర్ ఆలోచనలతో విభేదాలు ఉన్నాయి. గతంలో భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న ఆర్‌పీ సింగ్, దేశీయ క్రికెట్‌లో భువీ ఫామ్‌ను గుర్తిస్తూ అతనికి మళ్లీ జట్టులో అవకాశం ఇవ్వాలని గట్టిగా వాదించాడు. కానీ అగర్కర్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నంత కాలం ఇతర సెలక్టర్ల వాయిస్‌కు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. అక్టోబర్ 4తో అజిత్ అగర్కర్ పదవీ కాలం ముగియడం, బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన కొద్ది గంటల్లోనే సీన్ పూర్తిగా మారిపోయింది. అగర్కర్ నిష్క్రమణతో మిగిలిన సెలక్టర్లు భువీ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా మొగ్గు చూపడంతో న్యూజిలాండ్ టూర్‌కు లైన్ క్లియర్ అయింది. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని సమయంలో భువీ లాంటి అనుభవజ్ఞుడి రాక జట్టుకు పెద్ద ప్లస్ కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.