పల్నాడు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. తాజాగా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో వైఎస్సార్ వర్ధంతి, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సరికొత్త ఫ్లెక్సీల రగడ మొదలైంది. రాబోయే 2029 రాజకీయ సమీకరణాలను టార్గెట్ చేస్తూ ఇరు వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
వైసీపీ శ్రేణులు తొలుత ఒక అడుగు ముందుకేసి.. “2029లో జగన్ మళ్లీ సీఎంగా వస్తాడు.. మీకు చేతనైతే ఆపుకోండి” అంటూ సవాల్ విసురుతూ భారీ ఫ్లెక్సీలు కట్టాయి. ఈ వైఖరిపై తీవ్రంగా స్పందించిన కూటమి కూటమి శ్రేణులు అదే స్థాయిలో తిరుగు జవాబు ఇచ్చాయి. వైసీపీ ఫ్లెక్సీలకు సరిగ్గా కౌంటర్‌గా “రాడు.. రానీయం” అంటూ రాసి ఉన్న పోస్టర్లను అక్కడ ప్రదర్శించాయి.
ఈ ఇరు వర్గాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కూడిన ఫ్లెక్సీల వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్ర్రెండ్ అవుతోంది. మున్ముందు రాబోయే ఎన్నికల హీట్‌ను ఇప్పుడే కళ్లకు కట్టేలా ఉన్న ఈ పోస్టర్ల ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు అక్కడ నిఘా ఉంచారు.














