వైసీపీ సోషల్ మీడియాకు బాబు-పవన్ స్లిప్పర్ షాట్..!

0
8

రాష్ట్ర సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. గత కొన్ని రోజులుగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ, నేతల మధ్య గ్యాప్ పెరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు, కథనాలను అల్లాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం ఒక గట్టి సమాధానంగా నిలిచింది.

చాలా రోజుల తర్వాత రాష్ట్ర డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఫుల్ జోష్ లో ఈ కేబినెట్ భేటీకి అత్యంత ఉత్సాహంగా హాజరయ్యారు. సచివాలయంలో అడుగుపెట్టిన జనసేనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలకడం విశేషం. ఈ అద్భుత దృశ్యంతో ఒక్కసారిగా సచివాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. చాలా కాలం తర్వాత కూటమి ప్రభుత్వానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఒకే చోట ఎంతో నవ్వుతూ, అత్యంత సన్నిహితంగా కనిపించడంతో విపక్షాల ఆనందం ఆవిరైపోయింది.

పవన్ కళ్యాణ్ వరుసగా కొన్ని కేబినెట్ సమావేశాలకు రాకపోవడాన్ని, అమరావతి భవనాల ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ శ్రేణులు కుట్రపూరిత కథనాలు వండాయి. అయితే అనారోగ్య కారణాల వల్లే పవన్ కళ్యాణ్ గత సమావేశాలకు రాలేకపోయారని, పార్టీల మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని ఈ భేటీతో స్పష్టమైంది. ఇద్దరు నేతలు ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ, ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్న ఫోటోలు బయటకు రావడం కూటమి శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.

ఈ కలయిక కేవలం ఒక సాధారణ భేటీ కాదని, కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎంత పటిష్టంగా సాగబోతోందో చెప్పడానికి ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆత్మీయ కరచాలనం చేసుకున్న ఈ వైరల్ ఫోటోలు వైసీపీ సోషల్ మీడియాకు ఒక రకమైన ‘స్లిప్పర్ షాట్’ లాంటివని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అబద్ధపు ప్రచారాలతో కూటమిని బలహీనపరచాలని చూసిన విపక్ష నేతలకు ఈ ఒక్క ఫోటోతో మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ తగిలిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో “కింగ్ అండ్ కింగ్ మేకర్” మళ్లీ కలిశారంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.